సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. బడ్జెట్ 2020
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 1 ఫిబ్రవరి 2020 (11:18 IST)

బడ్జెట్ 2020, బంగారం ధరలు ఎలా వున్నాయి?

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు శనివారం బడ్జెట్ 2020 ప్రవేశపెడుతున్న నేపధ్యంలో ఫిబ్రవరి 1-2-2020 బంగారం ధరలు కాస్త తగ్గాయి. అంతర్జాతీయంగా బంగారం ధరలు కొద్దిగా తగ్గుదల నమోదు చేయడంతో దేశీయంగా ధరలో కూడా తేడా వచ్చింది. 24 క్యారెట్ల బంగారం పది గ్రాములకు 80 రూపాయలు తగ్గగా, 24 రెట్ల బంగారం పది గ్రాములకు 42,410 నుంచి 42,330 రూపాయల మేరకు తగ్గుదల కనిపించింది.
 
ఐతే వెండి ధర మాత్రం కళ్లెం లేకుండా పరుగులు తీస్తోంది. కేజీకి 50 రూపాయల చొప్పున వెండి ధర పెరిగడంతో ఆ ధర కేజీకి రూ. 49,860 రూపాయల వద్ద సాగుతోంది. మన తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపుగా ఇలాంటి ధరలే వున్నాయి.