ఆదివారం, 24 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 26 సెప్టెంబరు 2024 (19:19 IST)

పసిడికి రెక్కలు.. 77వేల మార్క్.. బంగారం ధర రూ. లక్ష దాటుతుందా?

gold price
అమెరికా మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. డాలర్ ధర పతనం అవుతోంది. ఇప్పటికే డాలర్ ధర 9 నెలల కనిష్ట స్థాయికి చేరింది ఈ నేపథ్యంలో బంగారం ధరలు భారీగా పెరిగేందుకు ఆస్కారం ఏర్పడింది. 
 
రానున్న రోజుల్లో బంగారం ధర రూ.లక్ష దాటడం ఖాయమని చెబుతున్నారు ఆర్థిక నిపుణులు. దేశంలో చరిత్రలోనే తొలిసారిగా 77వేల మార్క్ దాటింది తులం బంగారం ధర. దీపావళికి ఈ రేటు కాస్త మరింత పెరిగే అవకాశం వుందని తెలుస్తోంది. 
 
చరిత్రలోనే తొలిసారిగా బంగారం ధర సరికొత్త రికార్డును సృష్టించింది. సెప్టెంబర్ 26 గురువారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 77,020గా ఉంది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 70,600గా ఉంది.