మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 26 సెప్టెంబరు 2024 (15:51 IST)

సినీ ఫక్కీలో కిడ్నాప్.. రాబరీ.. కార్లలో 2.5 కిలోల బంగారం దోచుకెళ్లారు.. (video)

Car
Car
కేరళలోని త్రిస్సూర్‌లో 2.5 కిలోల బంగారం దోచుకెళ్లారు దుండగులు. ఈ సంఘటన సెప్టెంబర్ 22న జరిగింది. సినీఫిక్కీలో పీచీ సమీపంలోని జాతీయ రహదారి వద్ద 12 మందితో కూడిన ముఠా మూడు కార్లలో దారి దోపిడీకి పాల్పడ్డారు. ఈ క్రమంలో 2.5 కిలోల బంగారు ఆభరణాలను దోచుకెళ్లినట్లు పోలీసులు గురువారం తెలిపారు. ఈ రాబరీ కోసం త్రిశూర్‌ హైవేపై భారీ ఛేజింగ్‌ డ్రామా నడిచింది. 
 
త్రిశూర్‌ హైవేపై గోల్డ్‌ వ్యాపారి కారును మూడు కార్లతో వెంబడించి.. భారీ మొత్తంలో బంగారాన్ని కొట్టేసింది. క్షణాల్లో కారులో ఉన్న బంగారాన్ని లాక్కున్నారు. ఆ తర్వాత గోల్డ్ వ్యాపారిని కూడా కారులో ఎక్కించుకుని.. నాలుగు కార్లలో పరారయ్యారు.
 
ఈ ఘటనకు సంబంధించిన వీడియో గురువారం వైరల్ అయ్యింది. అందులో మూడు కార్లు జాతీయ రహదారి మధ్యలో మరో కారును అడ్డుకున్నాయి. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందిందని, వివిధ సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.