రాయితీ గ్యాస్‌పై పిడుగుపాటు : రూ.50 వడ్డన

gas cylinder
ఠాగూర్| Last Updated: బుధవారం, 2 డిశెంబరు 2020 (11:37 IST)
దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతున్నాయి. ఈ ధరల పెరుగుదలకు అడ్డుకట్ట పడటం లేదు. ఈ ధరల పెరుగుదలతో ఇబ్బంది పడుతున్న సామాన్యులపై ఇపుడు మరో పిడుగు పడింది.

రాయితీ గ్యాస్‌ సిలిండర్‌‌ ధరలను భారీగా పెంచుతూ దేశీయ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ఒక్కో సిలిండర్‌పై రూ.50 భారం పడనుంది. పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని కంపెనీలు ప్రకటించాయి.

ఈ పెంపుతో దేశరాజధాని ఢిల్లీలో రాయితీ సిలిండర్‌ ధర రూ.594 నుంచి రూ.644కు పెరిగింది. దేశంలో వరుసగా చమురు ధరలు వరుసగా పెంచుతూ వస్తున్న పెట్రో కంపెనీలు తాజాగా గ్యాస్‌ సిలిండర్‌ రేట్లను పెంచాయి.

కాగా, దేశంలోని ఒక్కో రాష్ట్రంలో ఎల్పీజీ ధరలు ఒక్కో రకంగా ఉండటంతో సిలిండర్‌ ధరల్లో హెచ్చు తగ్గులు ఉంటాయి. హైదరాబాద్‌లో ఇప్పటివరకు సిలిండర్‌ ధర రూ.646.50గా ఉండగా తాజా పెంపుతో రూ.696.5కు చేరే అవకాశం ఉంది.దీనిపై మరింత చదవండి :