జులై, ఆగష్టు, సెప్టెంబర్.. మూడు నెలల పాటు గ్యాస్‌ ఫ్రీ

gas cylinder
gas cylinder
సెల్వి| Last Updated: బుధవారం, 8 జులై 2020 (19:19 IST)
కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో కేంద్రం శుభవార్త చెప్పింది. కరోనా సమయంలో భారత ప్రభుత్వం గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద మహిళలకు మూడు నెలల పాటు గ్యాస్‌ను ఉచితంగా అందించనుంది. ముఖ్యంగా ఉజ్వల్ యోజన పథకంలో ఉన్న మహిళలకు ఇప్పటికే మూడు నెలలపాటు గ్యాస్ ఉచితంగా ఇచ్చిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఈ స్కీమ్‌ను మరో మూడు నెలల పాటు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. జూలై ఒకటే తేదీ వరకు ఈ స్కీమ్ అమలులోకి వస్తుంది. ఫలితంగా జులై, ఆగష్టు, సెప్టెంబర్ నెలలకు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా అందివ్వబోతున్నారు. ఇప్పటికే దీపావళి వరకు రేషన్ ఫ్రీగా ఇస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి తోడు సిలిండర్ కూడా ఉచితంగా ఇవ్వడం పట్ల మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.దీనిపై మరింత చదవండి :