శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By TJ
Last Modified: శనివారం, 25 నవంబరు 2017 (19:01 IST)

బంగారం షాపులకు షాక్... జనవరి నెల తరువాత అలా చేస్తారట...

బంగారంలో నాణ్యతా ప్రమాణాలు కట్టుదిట్టం చేసేందుకు కేంద్రం నూతన నిబంధనలతో ముందుకు వచ్చింది. బంగారం విక్రయించే ముందు దాని నాణ్యతను ధృవీకరించే హాల్ మార్క్ క్యారెట్ కౌంట్‌ను అనివార్యం చేయనుంది. జనవరి నెల నుంచి హాల్ మార్కింగ్ నిబంధనను తీసుకురానున్నట్లు ఇప్

బంగారంలో నాణ్యతా ప్రమాణాలు కట్టుదిట్టం చేసేందుకు కేంద్రం నూతన నిబంధనలతో ముందుకు వచ్చింది. బంగారం విక్రయించే ముందు దాని నాణ్యతను ధృవీకరించే హాల్ మార్క్ క్యారెట్ కౌంట్‌ను అనివార్యం చేయనుంది. జనవరి నెల నుంచి హాల్ మార్కింగ్ నిబంధనను తీసుకురానున్నట్లు ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. ప్రస్తుతం ప్రజలు కొంటున్న నగలు నాణ్యత గురించి తెలియడం లేదని, జనవరి నెలకల్లా బంగారు ఆభరణాలకు హాల్ మార్క్‌ను తప్పనిసరి చేసేలా నిర్ణయం తీసుకోనున్నారు.
 
కొన్ని హాల్ మార్క్‌లపై బి.ఐ.ఎస్ మార్కులు ఉన్నా అవి సరైన నాణ్యతను వెల్లడించేలా లేదన్నారు. నూతన నిబంధనల ప్రకారం ఆభరణాల్లో ఉపయోగిస్తున్న బంగారు క్యారెట్ల గురించి కూడా హాల్ మార్క్‌లో పొందుపరుస్తారు. హాల్ మార్క్‌లో 14,18, 22 క్యారెట్ల మూడు కేటగిరిల్లో హాల్ మార్క్‌ను ఇవ్వనున్నారు. ఈ విధంగా కేంద్ర నూతన నిబంధనలతో ఖచ్చితంగా బంగారు షాపులన్నీ తగ్గిపోయే అవకాశం లేకపోలేదు.