హువావే ఫ్రీలేస్ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్ విడుదల
హువావే మొబైల్ కంపెనీ ఫ్రీలేస్ పేరిట సరికొత్త వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్‌ను ఇటీవల విడుదల చేసింది. వీటిలో 9.2 ఎంఎం డైనమిక్ డ్రైవర్ యూనిట్‌ను అమర్చి ఉన్నందున ఈ ఇయర్‌ఫోన్స్ నుండి వెలువడే సౌండ్ అత్యంత నాణ్యతను కలిగి ఉంటుంది. ఈ ఇయర్‌ఫోన్స్ బ్లూటూత్ 5.0 ఆధారంగా పనిచేస్తాయి. ఐపీఎక్స్ 5 వాటర్ రెసిస్టెన్స్‌ను వీటికి అందిస్తున్నారు.
వీటిలో అమర్చి ఉన్న 120 ఎంఏహెచ్ బ్యాటరీని ఒక్కసారి ఫుల్ చార్జింగ్ చేస్తే 18 గంటల పాటు ఉపయోగించుకోవచ్చు. రూ.7,700 ప్రారంభ ధరతో ఈ ఇయర్‌ఫోన్స్ వినియోగదారులకు త్వరలో అందుబాటులోకి రానున్నాయి.