శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 15 సెప్టెంబరు 2016 (15:57 IST)

రైలు ప్రయాణికులకు శుభవార్త... ఐఆర్‌సీటీసీ యూజర్లకు బీమా సౌకర్యం

రైలు ప్రయాణికులకు ఓ శుభవార్త. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో రైల్ రిజర్వేషన్ టిక్కెట్ బుక్ చేసుకునే యూజర్లకు బీమా సౌకర్యం కల్పించనున్నారు. ఈ వెసులుబాటు ఈనెల ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చింది.

రైలు ప్రయాణికులకు ఓ శుభవార్త. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో రైల్ రిజర్వేషన్ టిక్కెట్ బుక్ చేసుకునే యూజర్లకు బీమా సౌకర్యం కల్పించనున్నారు. ఈ వెసులుబాటు ఈనెల ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో టిక్కెట్ బుక్ చేసుకునే యూజర్లు.. టిక్కెట్ బుక్ చేసుకునే సమయంలోనే ప్యాసింజర్ ఇన్సూరెన్స్ స్కీమ్‌ను ఎంపిక చేసుకున్నట్టయితే, బీమా సౌకర్యం ఆప్షన్‌ను నిర్ధారించాల్సి ఉంటుంది. 
 
ఈ ఆప్షన్‌ను ఎంపిక చేసుకున్నట్టయితే ఒక్కో ప్రయాణికుడికి రూ.0.92 పైసలు చొప్పున బీమా పాలసీకి వసూలు చేస్తారు. ఆ తర్వాత సంబంధిత బీమా కంపెనీల నుంచి ప్రయాణికుడి మొబైల్ నంబరుకు ఎస్ఎంఎస్ వస్తుంది. అయితే, ఈ బీమా సౌకర్యం నిబంధనలు వర్తిస్తాయి. ఇప్పటికే అన్ని ఏసీ రిజర్వేషన్ ప్రయాణికులకు ఈ సౌకర్యం అందుబాటులో ఉండగా, ఇపుడు సెకండ్ క్లాస్ స్లీపర్ రిజర్వేషన్ ప్రయాణికులకు కూడా అందుబాటులోకి తెచ్చింది.