బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 2 జనవరి 2024 (22:33 IST)

మార్కెట్ పతనం- పెట్టుబడిదారుల మనస్తత్వం: ఆలిస్ బ్లూ సీఈఓ, వ్యవస్థాపకుడు సిద్దవేలాయుధం

cash notes
ఎవరైనా పెట్టుబడి పెట్టడంలో నైపుణ్యం కలిగి ఉంటే, అతను/ఆమె ఖచ్చితంగా ఐక్యూ, లెక్కలు వేయడంలో కూడా మంచి నైపుణ్యంతో ఉంటారని చాలా మంది నమ్ముతారు. దీనికి విరుద్ధంగా, ఈ ప్రపంచంలో సగటు ఐక్యూ ఉన్న పెట్టుబడిదారులు సైతం తమ మనసును నియంత్రించడం, సరైన సమయంలో హేతుబద్ధమైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా అసాధారణ రాబడిని, సంపదను సృష్టించారు.
 
మార్కెట్ పతనం సమయంలో పెట్టుబడిదారుడి ఆలోచనలు సరైన దిశలో సాగవు. సాధారణంగా, ఈ పరిస్థితిలో, పెట్టుబడిదారులు భయాందోళనలకు గురవుతారు. పతనానికి అసలు కారణాన్ని అర్థం చేసుకోకుండా తమ పెట్టుబడులను ఉపసంహరించటం చేస్తారు. మరోవైపు, చాలామంది తెలివైన పెట్టుబడిదారులు చాలా ఆకర్షణీయమైన వాల్యుయేషన్‌తో ఎక్కువ కొనుగోలు చేసే అవకాశంగా దీనిని చూస్తారు.
 
ఒక ప్రసిద్ధ సామెత ఉంది - ప్రజలు భయపడినప్పుడు "కొనండి", వారు అత్యాశతో ఉన్నప్పుడు "అమ్మండి". ఇప్పుడు ఎక్కువ మంది పెట్టుబడిదారులలో తీవ్ర ఆశావాదం ఉంది, ఇక్కడ వడ్డీ రేటు త్వరలో గరిష్ట స్థాయికి చేరుతుందని అందరూ ఆశిస్తున్నారు. స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ సూచీలు గరిష్ట స్థాయిని తాకడంతో పాటు మార్కెట్ దాదాపు ప్రతిరోజూ ఆల్-టైమ్ గరిష్టాలను తాకుతున్న పరిస్థితికి దారితీసింది. దీర్ఘకాలిక పెట్టుబడిదారుగా, అతని/ఆమె మనస్సులో ఎల్లప్పుడూ భద్రత యొక్క మార్జిన్ ఉండాలి. ఇది ప్రస్తుత మార్కెట్ ధర, స్టాక్ యొక్క అంతర్గత విలువ మధ్య వ్యత్యాసం. మార్కెట్ పతనం జరుగుతున్నట్లు మీరు చూస్తే, ప్రస్తుత మార్కెట్ ధర, నిజమైన అంతర్గత విలువ మధ్య వ్యత్యాసాన్ని స్పష్టంగా చూడాలి. నిజానికి, హేతుబద్ధమైన పెట్టుబడిదారులు ఆ సమయంలో స్టాక్‌లు చాలా తక్కువగా ఉన్నందున ఈ అవకాశాల కోసం ఎక్కువ కొనుగోలు చేయడానికి వేచి ఉంటారు.
 
అదనంగా, చాలా మంది మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు తమ మ్యూచువల్ ఫండ్ రాబడులను రక్షించుకోవడానికి మార్కెట్ పతనం సమయంలో వారి SIPలను కూడా విక్రయిస్తారు. అయితే, SIPలు దీర్ఘకాలానికి ఉద్దేశించినవని అర్థం చేసుకోవాలి, చివరగా పెట్టుబడి ప్రయాణంలో మార్కెట్ పతనానికి అనేక కారణాలు ఉంటాయి, హేతుబద్ధంగా ఆలోచించే వ్యక్తిగా ఉండాలి. విజయవంతమైన పెట్టుబడిదారుగా ఉన్నప్పుడు ఉండాల్సిన  స్వభావం ఇది అని అర్థం చేసుకోవాలి.