మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 9 మార్చి 2018 (13:57 IST)

మెర్సీడెజ్ బెంజ్ ఎస్350.. ధర రూ.1.37 కోట్లు

విదేశీ లగ్జరీ కార్ల తయారీ కంపెనీల్లో ఒకటైన మెర్సీడెజ్ బెంజ్ కంపెనీ తాజాగా తన లేటెస్ట్ వెర్షన్ కారును దక్షిణాది మార్కెట్‌లోకి విడుదల చేసింది. మేక్ ఇన్ ఇండియా.. మేడ్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఈ కార

విదేశీ లగ్జరీ కార్ల తయారీ కంపెనీల్లో ఒకటైన మెర్సీడెజ్ బెంజ్ కంపెనీ తాజాగా తన లేటెస్ట్ వెర్షన్ కారును దక్షిణాది మార్కెట్‌లోకి విడుదల చేసింది. మేక్ ఇన్ ఇండియా.. మేడ్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఈ కారును భారత్‌లోనే తయారు చేయడం విశేషం. మెర్సీడెజ్ బెంజ్ ఎస్350 పేరుతో మార్కెట్‌లోకి ప్రవేశపెట్టిన ఈ కారు (డీజిల్ వెర్షన్) ధర రూ.1.33 కోట్లు. పెట్రోల్ వెర్షన్ కారు ధర రూ.1.37 కోట్లు. భారతీయ మెర్సీడెజ్ బెంజ్ చరిత్రలోనే ఈ కారు కోసం అత్యాధునిక, శక్తివంతమైన ఇంజిన్‌ను అమర్చడం దీని ప్రత్యేకత.
 
ఇదే అంశంపై ఆ కంపెనీ మార్కెటింగ్, సేల్స్ విభాగం వైస్ ప్రెసిడెంట్ మైఖేల్ జాప్ మాట్లాడుతూ, దేశంలో దక్షిణాది మార్కెట్ తమకు ఎంతో కీలకమన్నారు. దక్షిణాది మార్కెట్‌లో నిలకడగా వృద్ధిని సాధిస్తున్నట్టు చెప్పారు. దీంతో మరింత మంది కొనుగోలుదార్లను ఆకర్షించాలన్న ఉద్దేశ్యంతోనే తాజా మోడల్‌ను ఆవిష్కరించినట్టు తెలిపారు. 
 
ఈ కారులో ఓఎం 656 రకం ఇంజిన్‌ను ఉపయోగించడం జరిగిందన్నారు. అలాగే, అంతర్గతంగా ఆరు సిలిండర్ల మోటార్స్‌ను అమర్చామన్నారు. దీనివల్ల అతి తక్కువ సమయంలో గరిష్టవేగాన్ని అందుకోవచ్చని తెలిపారు. అంతేకాకుండా, ఇది కాలుష్య రహిత కారు అని వివరించారు.