శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By
Last Modified: బుధవారం, 9 జనవరి 2019 (17:58 IST)

ఎంజి మోటార్ ఇండియా మొదటి ఎస్‌యువి “ఎంజి హెక్టర్”

ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఎస్‌యువికి ఎంజి(మారిస్ గరాజస్) మోటార్ ఇండియా నేడు ‘హెక్టర్’ అని పేరుపెట్టింది. ఈ ఏడాది మధ్యలో దీన్ని మార్కెట్‌లోకి విడుదల చేయనున్నారు. ట్రాయ్ యుద్దవీరుడైన యువరాజు హెక్టర్ స్ఫూర్తితో ఈ ఉత్తమ శ్రేణి వాహనానికి ఈ పేరు పెట్టారు. బలానికి, ధైర్యానికి, అదేసమయంలో నమ్మకానికి, విశ్వసనీయతకు హెక్టర్ ప్రతీక. అంతేకాదు, ఎంజిఎస్ యువి వాహనం స్వరూపం, ఆకారం, ఆకృతుల్లో కూడా ఈ విలువలను పుణికిపుచ్చుకుంది.
 
1930లలో బ్రిటిష్ వైమానిక దళం వాడిన, బ్రిటిష్ వారి మహోన్నత ఇంజనీరింగ్ సంప్రదాయానికి చిహ్నమైన రాయల్ హెక్టర్ బైప్లేన్ రాయల్ హెక్టర్ స్మ్రుతి సూచకంగా కూడా ఎంజి ఈ పేరును ఖరారు చేసింది. గుజరాత్ లోని హలోల్‌లో గల కంపెనీ అధునాతన కర్మాగారంలో 2019 రెండవ త్రైమాసికంలో ఎంజి హెక్టర్ ఉత్పత్తి ప్రారంభమవుతుంది. 75శాతానికి పైగా స్థానిక ఉత్పత్తితో ప్రారంభించి అత్యుత్తమ ప్రమాణాలతో కంపెనీ అంతకంతకూ వృద్ధి చెందుతున్న ఖరీదైన ఎస్‌యువిల విభాగంలో తనదైన ముద్ర వేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
 
“అంతర్జాతీయ అనుభవం ఆధారంగా వాహనం విశిష్టతలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ మారుతున్న వినియోగదారుల అభిరుచులకు, భారతీయ రహదారుల స్థితిగతులకు అనుగుణంగా హెక్టర్ యాంత్రిక వ్యవస్థల్లో గణనీయమైన మార్పులు చేశాం.2019 మే నాటికి 100 అమ్మకం, సర్వీసు కేంద్రాలు ఏర్పాటు చేసి, హెక్టర్‌తో మార్కెట్ ఆశలను, ఆకాంక్షలను మించిపోగలమన్న విశ్వాసం మాకు ఉంది,” అని చెప్పారు ఎంజి మోటార్ ఇండియా అధ్యక్షుడు, మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ చాబా.
 
భావి కొనుగోలుదారులకు చేరువకావడానికి ఎంజి మోటార్ ఇప్పటికే తన అంతర్జాతీయ వాహనాలను దేశంలోని 10 కి పైగా నగరాల్లో ప్రదర్శిస్తోంది. అలాగే ఇటీవల తమ వెబ్ సైట్‌ను పునర్వ్యవస్థీకరించి వినియోగదారులకు ఘన చరిత్ర కలిగిన ఈ బ్రిటిష్ బ్రాండ్ గురించి, హెక్టర్ ఎస్ యువి గురించి తాజా సమాచారాన్ని అందిస్తోంది.