శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 9 జనవరి 2019 (17:13 IST)

శ్రీశైలంలో సువర్ణ పుష్పం... తింటే ఏమవుతుందో తెలుసా?

సాధారణంగా శ్రీశైలం అంటే మనకు గుర్తుకు వచ్చేది పచ్చని చెట్లు, చక్కటి సెలయేర్లు, సువాసనలు వెదజల్లే  పుష్పాలు ఇలా ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో శ్రీ భ్రమరాంబా సమేతుడైన మల్లికార్జున స్వామి. ఈ స్వామి ధ్యాన ప్రియుడు, అభిషేక ప్రియుడు, జ్ఞాన ప్రియుడు, అడిగిన వెంటనేవరాలిచ్చే భోళాశంకరుడు. ఈ భోళాశంకరునికి మాఘ మాసంలో మాత్రమే వచ్చే సువర్ణ పుష్పాలు అంటే ఎంతో ప్రీతి. మనస్పూర్తిగా ఈ సువర్ణ పుష్పాలతో శివుని పూజిస్తే శివ కటాక్షము పుష్కలంగా లభిస్తుంది అనడంలో సందేహం లేదు. 
 
శ్రీశైలం అడవులలో మాత్రమే దొరికే ఈ సువర్ణ పుష్పాలు కేవలం పూజకు మాత్రమే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎంతో ఉపయోగపడతాయి. ప్రతిరోజు ఒక పుష్పం చొప్పున ఈ పుష్పాన్ని తినడం వలన నిత్య యవ్వనంగా కనిపించడమే కాకుండా ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారు. ఈ పుష్పం సంతానప్రాప్తిని కూడా కలుగచేస్తుందని విశ్వాసం. ఒక సువర్ణ పుష్పంతో స్వామిని పూజిస్తే ఒక కేజీ బంగారంతో పూజించిన ఫలితం ఉంటుందని భక్తుల విశ్వాసం. 
 
అడవులలో ధ్యానం చేసే యోగులు ఈ పుష్పాన్ని స్వీకరించడం వల్ల ఆకలి, దాహం లేకుండా ఎంతసేపయినా ప్రశాంతంగా ఉండగలరని చెపుతారు. ఈ పుష్పాన్ని ఆయుర్వేద మందుల తయారీలో కూడా ఉపయోగిస్తారు.