గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 5 నవంబరు 2020 (19:47 IST)

క్యాడ్‌బరీ సెలెబ్రేషన్స్: ఈ దీపావళి సందర్భంగా ‘మంచి’ని కోరుతున్న మాండలీజ్ ఇండియా

ఈ దీపావళిని ఎప్పటికప్పుడు మధురమైన వేడుకగా మార్చాలనే లక్ష్యంతో భారతదేశంలోని కొన్ని ఐకానిక్ స్నాకింగ్ బ్రాండ్ల తయారీదారు మరియు బేకర్స్ అయిన మాండలీజ్ ఇండియా, క్యాడ్‌బరీ వేడుకలతో, ‘ఇస్ దీపావళి ఆప్ #Kise KhushKarenge?’ ప్రచారం ఆవిష్కారంతో పండుగ సందళ్లను మరోసారి ప్రకాశవంతం చేయడానికి సిద్ధంగా ఉంది. ఇ కామర్స్-ఎక్స్‌‌క్లూజివ్ ప్రీమియం ప్యాక్, ఓరియో మూమెంట్స్, క్యాడ్‌బరీ కోకో #TheSweetestDiwali యాక్టివేషన్‌తో ఈ సంస్థ ఉత్సవాలకు మరింత మెరుపునిస్తుంది.
 
ఈ సందర్భంగా మాండలీజ్ ఇండియా మార్కెటింగ్ (చాకొలెట్స్) ఇన్ సైట్స్ అండ్ అనలిటిక్స్ సీనియర్ డైరెక్టర్ అనిల్ విశ్వనాథన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘పండుగల సంద ర్భంగా బహుమతులు, స్వీట్ల మార్పిడి ఒక ముఖ్యమైన భావోద్వేగ విలువను కలిగి ఉంటుంది మరియు ఒక కొత్త శకానికి నాంది పలుకుతుంది. ఈ చిన్న, ఇంకా ముఖ్య మైన సంప్రదాయంలో మాకు ఒక స్థానం లభించడం మాకు చాలా గర్వంగా ఉంది.
 
అంతేకాకుండా, ఈ సంవత్సరం, కొత్త ఆరంభాలను మరియు అసంపూర్ణ ప్రపంచంలో మంచితనం సామర్థ్యాన్ని సూచించే చర్యల మించింది మరొకటి ఉండదు. మా ఇటీవలి క్యాడ్‌బరీ వేడుకల ప్రచారం ఔదార్యాన్ని ప్రేరేపించేదిగా ఉంటుంది. ‘ఇస్ దీపావళి ఆప్ కిసేఖుష్ కరెంగే ప్రతిపాదన ద్వారా  కష్ట సమయాల్లో మనకు సహాయం చేసిన వ్యక్తులను గుర్తించడం ద్వారా ఈ సమయంలో సరైనది చేయాల్సిందిగా ప్రజలను ప్రేరేపించడానికి మేం మా అడుగును ముందుకు వేస్తున్నాం. ఇది 'మిఠాయి'లతో ప్రత్యేక సందర్భాలను అల్లడం కావచ్చు లేదా సంతోషకరమైన వేడు కలకు ఉల్లాసాల మెరుపులను అద్దడం కావచ్చు.
 
ప్రతీ సందర్భంలోనూ మనం ఎంతో ఇష్టపడే చిరుతిళ్లు ప్రతి వేడుకలో అంతర్భాగంగా మారాయి. అందువల్ల, ఈ సంవత్సరం మేం మా ప్రయత్నాన్ని విస్తరించడం ద్వారా ఈ ప్రయత్నాన్ని మరింతగా పెంచుతున్నాం. మా వినియోగదారులకు మరిన్ని ఎంపికలను అందించడానికి ఇ-కామర్స్ ప్రీమియం పోర్ట్‌ ఫోలియోను విస్తరిస్తున్నాం, చాక్లెట్లకు మించి మా బ్రాండ్‌లలో అనేక ఉత్తేజకరమైన కార్యక్రమాలను చేపడుతున్నాం’’ అని అన్నారు. 
 
‘కుచ్ అచ్ఛా హో జాయే, కుచ్ మీఠా హో జాయే’ వారసత్వాన్ని కొనసాగిస్తూ మాండలీజ్ ఇండియా ఇప్పుడు ఓ అడుగు ముందుకేసింది. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఇప్పుడు 260కి పైగా పిన్ కోడ్ లలో 1800కు పైగా స్థానిక రిటైలర్లను ప్రమోట్ చేస్తోంది. వినియోగదారుల్లో రిటైలర్లకు అవసరమైన ప్రాంత లక్ష్యిత విజిబిలిటీని అందిస్తోంది. ఈ విధమైన అత్యంత ఉదారపూర్వక  వాణిజ్యప్రకటనతో ఇతరులకు ఆదర్శంగా నిలిచింది.
 
స్థానిక వ్యాపారాలు తాజా క్యాడ్ బరీ సెలబ్రేషన్స్ యాడ్‌తో కలసి ప్రచారం చేయబడుతాయి. ‘ఇస్ దీపావళి ఆప్ # కిసేఖుష్ కరెంగే’ అనే సందేశాన్ని అందిస్తాయి. ఈ వాణిజ్య ప్రకటన అధునాతన సాంకేతికతను ఉపయోగించుకుంటోంది. భారతదేశ మొట్టమొదటి హైపర్ పర్సనలైజ్డ్ యాడ్ రూపకల్పనకు కృత్రిమ మేధను ఉపయోగించుకుంటోంది. ముంబై, దిల్లీ, పుణె, ఇండోర్, అహ్మదాబాద్, లక్నోలలో నిర్దిష్ట పిన్ కోడ్లలో ఆయా ఉత్పాదన విభాగాల ప్రకటనల్లో స్థానిక స్టోర్స్ వివరాలు కూడా కనిపిస్తాయి. ఓ భారతీయ కుటుంబం దీపావళి పండుగ సందర్భంగా చేసుకునే వేడుకకు అద్దంపట్టేలా ఈ యాడ్ ఉంటుంది. ఇందులో ఆ కుటుంబానికి చెందిన మహిళ ఒకరు కుటుంబ సభ్యుల్లో ప్రతి ఒక్కరికీ స్థానిక దుకాణాల నుంచి బహుమతుల్లో ఒక దాన్ని అందిస్తుంటారు. చివర్లో ఆలోచనను రేకెత్తించేలా ఒక సందేశం ఉంటుంది. ‘మనమంతా మన స్థానిక దుకాణాలకు అండగా నిలిస్తే, మనమంతా కూడా సంతోషదాయక దీపావళి చేసుకోవచ్చు’ అనేదే ఆ సందేశం. తద్వారా ఉదారంగా చేపట్టే ఓ చర్యను వెలుగులోకి తీసుకువస్తుంది.
 
క్యాడ్ బరీ కోకో ద్వారా ఈ సందేశం మరింత బలంగా అందుతోంది. క్యాడ్ బరీ కోకో ఉపయోగించ డం ద్వారా చేసిన ప్రత్యేక మిఠాయితో పండుగ సంద ర్భాలను మరింత వేడుక చేస్తున్న కుటుంబ సభ్యులకు మంచిదనపు సాయాన్ని తిరిగి ఇవ్వాల్సిందిగా ఇది వినియోగదారులను ప్రోత్సహిస్తుంది. అర్జున్ కపూర్, యువరాజ్ సింగ్ వంటి ప్రముఖులు తాము అభిమానిం చే వ్యక్తుల కోసం ఇంట్లో ప్రత్యేక వంటకాలు చేస్తారు. ప్రజలు కూడా అలా చేయాలని ప్రోత్సహిస్తారు. కాస్తంత ఆలోచించి, ఒక మార్పు కోసం, మీ చుట్టూరా ఉన్న వారిని ఆనందించేలా చేస్తూ, పండుగ వేడుక ను #TheSweetestDiwali గా మార్చేందుకు.
 
సురక్షిత అనేది వినియోగదారులకు రాజీపడే అంశం కాదు. కాంటాక్ట్ లెస్ షాపింగ్ ను అందించ డంలో ఇ-కామర్స్ ప్రముఖ పాత్ర పోషిస్తోంది. అందుకే మేం బహుమతులు ఇవ్వడంలోని ఆనందాన్ని పునర్నిర్వచించేలా మరిన్ని డిజిటల్ షాపింగ్ అవకాశా లను అందిస్తున్నాం. క్యాడ్ బరీ గిఫ్టింగ్ పోర్ట్ ఫోలియో కింద లభ్యమయ్యే సీజనల్ ఆఫరింగ్స్ ఇ-గ్రాసరీస్, మార్కెట్ ప్లేసెస్, ఇ-కామర్స్ వెబ్ సైట్స్, హైపర్ లోకల్ ఓమ్ని ఛానల్ రిటైలర్స్ మరియు కంపెనీ సొంత డైరెక్ట్- టు- కన్జ్యూమర్ వెబ్ సైట్ CadburyGifting.in వంటి వాటి ద్వారా అందుబాటులో ఉంటాయి. దాంతో ప్రజలు ఇక ఎలాంటి అవరోధాలు లేకుండా వేడుకల్లో పాలుపంచుకోవచ్చు.
 
ఈ పండుగ సీజన్ సందర్భంగా ప్రపంచ ప్రఖ్యాత కుకీ బ్రాండ్- ఓరియో తన ప్రత్యేక పండుగ ఎడిషన్- ఓరియో మూమెంట్స్ ద్వారా మరింత ఆనందదాయక క్షణాలను అందించడాన్ని కొనసాగించనుంది. ఓరియో మూమెంట్స్ బహుమతుల శ్రేణి గత రెండేళ్లుగా అమిత ప్రజాదరణ పొందుతూ వచ్చింది. ఓరియో క్యాడ్ బరీ డిప్డ్ మూమెంట్స్ కింద ప్రీమియం గిఫ్టింగ్ విభాగంలో సరికొత్త ప్యాక్ ను ఆవిష్కరించడంతో పాటుగా ఈ ఏడాది ఈ పోర్ట్ ఫోలియోను మరింత విస్తరించాలని కంపెనీ యోచిస్తోంది