1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By chitra
Last Updated : గురువారం, 22 సెప్టెంబరు 2016 (15:33 IST)

అపర కుబేరుడు ముఖేష్ అంబానీ.. ఆస్తి విలువ ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

భార‌తీయ వ్యాపార దిగ్గ‌జం, రిలయన్స్ గ్రూప్ సంస్థల అధినేత ముఖేష్ అంబానీ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఆయన గురించి దేశంలో చాలా మందికి తెలుసు. తాజా లెక్కల ప్రకారం ఆయన సంపద గురించి కొన్నిఆసక్తికర వార్త

భార‌తీయ వ్యాపార దిగ్గ‌జం, రిలయన్స్ గ్రూప్ సంస్థల అధినేత ముఖేష్ అంబానీ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఆయన గురించి దేశంలో చాలా మందికి తెలుసు. తాజా లెక్కల ప్రకారం ఆయన సంపద గురించి కొన్నిఆసక్తికర వార్తలు వెలువడ్డాయి. ఆయన ఆస్తి వివరాల గురించి తెలిస్తే అపర కుబేరులకైనా దిమ్మదిరిగి పోవాల్సిందే. తాజా లెక్కల ప్రకారం ఆయన ఆస్తి విలువ ఎంతో తెలుసా.... అక్షరాలా 1.52 లక్షల కోట్ల రూపాయలు. 
 
దేశంలోని అత్యంత సంపన్న వ్యక్తుల జాబితాలో మొదటి స్థానాన్ని దక్కించుకున్న ఘనత ఈయనదే. ప్రతి ఏటా పోర్బ్స్ మ్యాగజైన్ ధనికుల జాబితాను ప్రకటిస్తుంది. గత ఏడాది ముఖేష్ అంబానీ సంపద రూ.1.26 లక్షల కోట్లుగా ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు గత ఏడాది కాలంలో 21 శాతం పెరగటంతో అంబానీ సంపద కూడా అదే స్థాయిలో పెరిగిందని ఫోర్బ్స్ తన నివేదికలో వెల్లడించింది. ఈ జాబితాలో ఫార్మా దిగ్గజం దిలీప్ సంఘ్వీ రెండో స్థానంలో ఉన్నారు. ఆయన మొత్తం సంపద రూ.1.13 లక్షల కోట్లుగా లెక్కకట్టారు. సన్ ఫార్మా షేర్ల విలువ తగ్గడంతో గత ఏడాది కంటే ఆయన సంపద కొంత తగ్గిందని ఫోర్బ్స్ తెలిపింది. 
 
ఇకపోతే మూడో స్థానంలో హిందూజా సోదరులు నిలిచారు. అశోక్, శ్రీచంద్, ప్రకాష్, గోపీచంద్, ఈ నలుగురు సోదరులూ కలిసి మొత్తం హిందూజా సామ్రాజ్యాన్ని నడిపిస్తున్న సంగతి తెలిసిందే. ఐదు దశాబ్దాలుగా విప్రోను ముందుండి నడిపిస్తున్న ఆ గ్రూపు అధినేత అజీమ్ ప్రేమ్‌జీ ఈసారి నాలుగో స్థానానికి నిలిచారు. వేణుగోపాల్ బంగూర్ తొలిసారిగా టాప్ 20 జాబితాలో చోటుదక్కించుకున్నారు. ఆయనకు ఈ జాబితాలో 14వ స్థానం లభించింది. అలాగే ఏషియన్ పెయింట్స్ నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ అశ్వినీ దాని కూడా 34వ స్థానాన్నిసొంతం చేసుకున్నారు. ఈ ఏడాది భారత దేశంలో దాదాపు 6700 కోట్లకు పైగా సంపద పెంచుకున్నవాళ్లు మొత్తం 15 మంది ఉన్నారు.