1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 5 అక్టోబరు 2016 (13:16 IST)

రాయితీ గ్యాస్ కావాలంటే.. ఆధార్ నంబర్ ఉండాల్సిందే : పెట్రోలియం శాఖ

గ్యాస్ రాయితీ కావాలంటే ఆధారం కార్డు నంబరును తప్పకుండా సమర్పించాల్సిందేనంటూ కేంద్ర చమురు, పెట్రోలియం మంత్రిత్వ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అదీ కూడా వచ్చే నెల 30వ తేదీలోపు ఆధార్ నంబరును సమర్పించ

గ్యాస్ రాయితీ కావాలంటే ఆధారం కార్డు నంబరును తప్పకుండా సమర్పించాల్సిందేనంటూ కేంద్ర చమురు, పెట్రోలియం మంత్రిత్వ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అదీ కూడా వచ్చే నెల 30వ తేదీలోపు ఆధార్ నంబరును సమర్పించకుంటే ఎల్పీజీ రాయితీని రద్దు చేస్తామని ప్రకటించింది. 
 
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల్లో జరుగుతున్న అవినీతిని అరికట్టేందుకు ఆధార్ నంబరును తప్పనిసరి చేయాలని కేంద్రం భావిస్తున్న విషయం తెల్సిందే. ఇదే విషయంపై పలు మార్లు కోరింది కూడా. 
 
అయితే, వ‌చ్చేనెల 30 నుంచి ఆధార్‌ లేకపోతే ఎల్పీజీ రాయితీ సిలిండర్లు ఇవ్వబోమ‌ని కేంద్ర చమురు, పెట్రోలియం శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆధార్‌ కార్డు ఇంత‌వ‌ర‌కూ పొంద‌లేని వారు రెండు నెల‌ల్లోగా తీసుకొని స‌మ‌ర్పించాల‌ని పేర్కొంది. నవంబరు 30వ తేదీలోపు ఈ ప్ర‌క్రియ‌నంతా పూర్తి చేయాల్సిందేన‌ని చెప్పింది.
 
మరోవైపు.. గ్యాస్‌తో పాటు.. ఇతర సంక్షేమ పథకాల లబ్ది పొందేందుకు ఆధార్ నంబరును తప్పనిసరి చేయవద్దంటూ కేంద్రానికి సుప్రీంకోర్టు గతంలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది కూడా. అయితే, ఈ ఆదేశాలను పట్టించుకోని పెట్రోలియం శాఖ తాజాగా ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.