శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 3 ఆగస్టు 2022 (18:29 IST)

గుడ్ న్యూస్: తగ్గనున్న వంట నూనెల ధరలు..

cooking oil
రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం, ఇండోనేషియా పామాయిల్ ఎగుమతులపై కొంతకాలం ఆంక్షలు విధించడం లాంటి కారణాలతో భారతదేశంలో వంటనూనెల ధరలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోవడంతో వంటనూనెల ధరలు దిగొచ్చాయి.
 
వంట నూనెల ధరల్ని తగ్గించాలంటూ ఎడిబుల్ ఆయిల్స్ కంపెనీలతో కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ పలుమార్లు చర్చలు జరిపింది. వెంటనే వంటనూనెల ధరల్ని తగ్గించాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు... లీటర్‌పై ఎంత తగ్గించాలో ఆదేశించింది.  
 
గ్లోబల్ మార్కెట్‌లో పామాయిల్, సోయాబీన్ ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్ ధర తగ్గడంతో భారతదేశంలో వంటనూనెల ధరల్ని తగ్గించే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. గురువారం ఆయిల్ కంపెనీలతో జరగబోయే సమావేశంలో వంటనూనెల ధరల్ని తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించే అవకాశం ఉంది.