గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 20 జులై 2022 (10:27 IST)

తెలంగాణ రైతన్నలకు గుడ్ న్యూస్.. సబ్సీడీపై డ్రోన్లు.. స్ప్రే అలా చేసేస్తాయి..!

Farmers
తెలంగాణ రైతన్నలకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. రైతులకు డ్రోన్లు అందజేసే దిశగా తెలంగాణ వ్యవసాయ శాఖ అడుగులు వేస్తోంది. వ్యవసాయ యాంత్రీకరణకు సంబంధించి రైతులకు ఈ ఏడాది నుంచే సబ్సిడీపై డ్రోన్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ డ్రోన్లు పురుగు మందులను పిచికారీ (స్ప్రే) చేయడానికి ఉపయోగిస్తారు. 
 
డ్రోన్‌ ఆధారిత స్ప్రే పద్ధతుల వల్ల నీరు, పురుగుమందులు తక్కువ మొత్తంలో అవసరమవుతాయి. పురుగు మందుల్ని రైతులే స్వయంగా పిచికారీ చేయడం వల్ల అనేక దుష్ప్రభావాలకు గురవుతున్నారు. దీర్ఘకాలంలో అనారోగ్యం బారిన పడుతున్నారు. 
 
డ్రోన్‌ పిచికారీ వీటన్నిటి నుంచి రైతుల్ని కాపాడుతుంది. కొన్ని పంటలకు మొక్కలపైన స్ప్రే చేస్తే సరిపోతుంది. వాటికి ఎలా స్ప్రే చెయ్యాలి అనేది సెట్ చేసి పెట్టాలి. ఇకపోతే పంట ఎలా ఉంది అనేదానిని కూడా ఫోటోలు తీసి వ్యవసాయ నిపుణులకు పంపిస్తుంది. రైతులకు ఎటువంటి నష్టాలు కలగా కుండా డ్రోన్లు సహాయ పడతాయని అధికారులు అంటున్నారు.
 
రైతులను పూర్తిగా ఆధునిక సాగు పద్ధతుల వైపు మళ్లించాలని ప్రభుత్వం పలు నిర్ణయాలు ముందుకెళ్తోంది. ఇప్పటికే ట్రాక్టర్లు, దుక్కు దున్నే యంత్రాలు, వరికోత యంత్రాలు, రొటవేటర్లు, పవర్‌ టిల్లర్లు తదితర పరికరాలను సబ్సిడీపై అందజేస్తోన్న విషయం తెలిసిందే.