బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 6 మార్చి 2020 (16:14 IST)

యస్ బ్యాంక్ ఆర్థిక సంక్షోభం.. ఫోన్ పే సేవలకు తాత్కాలిక బ్రేక్

phonepe
ప్రైవేట్ బ్యాంకుల్లో ఒకటైన యస్ బ్యాంక్ ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయింది. దీంతో ఆర్బీఐ యస్ బ్యాంకుపై ఆంక్షలు విధించి.. రంగంలోకి దిగింది. దీనిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన ప్రకటనలో యస్ బ్యాంక్‌ను ఆర్బీఐ ఆధీనంలోకి తీసుకొచ్చినట్లు వెల్లడించింది. భారీ అప్పుల ఊబిలో చిక్కుకుపోయిన యస్ బ్యాంక్ ను గట్టెక్కించే పనిలో వున్నట్లు ఆర్బీఐ తెలిపింది. 
 
అంతేగాకుండా యస్ బ్యాంక్ యంత్రాంగం మొత్తం ఆర్బీఐ చేతిలోకి తెచ్చుకుంది. యస్ బ్యాంక్‌ కార్యకలాపాల నిర్వహణకు ఎస్‌బీఐ బ్యాంక్ మాజీ గవర్నర్ అయిన ప్రశాంత్ కుమార్‌ను నియమించడం జరిగింది. దీంతో నగదు పరివర్తనపై ఆంక్షలు పడ్డాయి. ఫలితంగా యస్ బ్యాంక్ కస్టమర్లు షాకయ్యారు. ఈ నేపథ్యంలో యస్ బ్యాంక్‌తో భాగస్వామి అయిన ఫోన్ పే సేవలకు కూడా బ్రేక్ పడింది. 
 
ఫోన్ పే సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఇంకా కస్టమర్లకు త్వరలో ఈ సేవలు ప్రారంభమవుతాయనే సందేశం కూడా వెళ్లింది. దీంతో ఫోన్ పే కస్టమర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.