శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 12 జులై 2022 (20:23 IST)

వరంగల్‌లో గృహ ఉత్సవ్‌ను నిర్వహిస్తోన్న పిరామల్‌ క్యాపిటల్‌ అండ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌

Jairam
పిరామల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌కు పూర్తి అనుబంధ సంస్థ అయిన పిరామల్‌ క్యాపిటల్‌ అండ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ (పీసీహెచ్‌ఎఫ్‌ఎల్‌), తెలంగాణా రాష్ట్రం వరంగల్‌లో మొట్టమొదటిసారిగా వినూత్న శైలిలో ప్రోపర్టీ ఎగ్జిబిషన్‌ను ‘గృహ ఉత్సవ్‌’ శీర్షికన నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా ఈ కంపెనీ అందుబాటు ధరలలో గృహ ఋణాలను ఉద్యోగులు, స్వీయ ఉపాధి కలిగిన వ్యక్తులకు అందజేస్తోంది.

 
ఈ గృహ ఉత్సవ్‌ను జూలై 16, జూలై 17, 2022 తేదీలలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి  8 గంటల వరకూ ఏకశిల హాల్‌, హరిత కాకతీయ, నక్కలగుట్ట,  హనమ్‌కొండ, వరంగల్‌, తెలంగాణా 506004 వద్ద నిర్వహించనున్నారు. ఈ కంపెనీ గృహ ఋణాలను  25బీపీఎస్‌ తగ్గించడంతో పాటుగా ప్రత్యేక లాగిన్‌ ఫీజు 499 రూపాయలతో అందిస్తుంది.

 
ఎగ్జిబిషన్‌ ప్రాంగణం వద్దకు అర్హత కలిగిన వ్యక్తులు అవసరమైన పత్రాలను తీసుకురావడం ద్వారా ఆన్‌ ద స్పాట్‌ అనుమతులను తమ కలల ఇంటి ఋణాల కోసం పొందవచ్చు. అదనంగా, వినియోగదారులు ప్రత్యేక ఆఫర్లను 29కు ప్రాజెక్టులలో పొందగలరు. వీటిని కనకదుర్గ హోమ్స్‌, వీ కన్‌స్ట్రక్షన్‌, హరిహర కన్‌స్ట్రక్షన్‌ మరియు శ్రీ మావీ(సిగ్నెట్‌) వంటి 12 మంది డెవలపర్లు అందిస్తున్నారు.

 
ఈ కార్యక్రమం గురించి పీసీహెచ్‌ఎఫ్‌ఎల్‌  మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీ జైరామ్‌ శ్రీధరన్‌ మాట్లాడుతూ, ‘‘వరంగల్‌లో గృహ ఉత్సవ్‌ నిర్వహిస్తుండటం పట్ల సంతోషంగా ఉన్నాము. దీని ద్వారా అతి సులభంగా గృహ ఋణాలను అందించాలన్నది మా ప్రయత్నం. పీసీహెచ్‌ఎఫ్‌ఎల్‌కు అత్యంత కీలకమైన మార్కెట్‌లలో తెలంగాణా ఒకటి. కేవలం రాష్ట్రంలో విస్తరించడం మాత్రమే కాదు, రాబోయే కాలంలో మా వినియోగదారులకు పలు విభిన్నమైన ఉత్పత్తులను సైతం అందించాలని  కోరుకుంటున్నాము. మా వినియోగదారులను చేరుకునేందుకు, ఆన్‌ ద స్పాట్‌ అనుమతులతో వారికి గృహ ఋణాలను అందించేందుకు గృహ ఉత్సవ్‌ అత్యుత్తమ వేదికగా నిలుస్తుంది. అంతేకాదు 29 ప్రాజెక్టులను అతి సులభంగా పొందే అవకాశం కూడా లభిస్తుంది’’అని అన్నారు.

 
పీసీహెచ్‌ఎఫ్‌ఎల్‌‌కు తెలంగాణాలో కోట్ల రూపాయల లోన్‌బుక్‌ సైజ్‌ ఉంది. ఇక్కడ 10 శాఖలు ఉండటం వల్ల అత్యంత కీలకమైన మార్కెట్లు అయిన హిమాయత్‌ నగర్‌, నాగోల్‌, ఏఎస్‌ రావు నగర్‌, కూకట్‌పల్లిలను హైదరాబాద్‌లో కవర్‌ చేయడంతో పాటుగా వరంగల్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, నల్గొండ వంటి ప్రాంతాలను సైతం కవర్‌ చేస్తుంది. ఈ కంపెనీ రాష్ట్రంలో తమ శాఖల సంఖ్యను రాబోయే మూడు సంవత్సరాలలో రెట్టింపు చేయాలని లక్ష్యంగా  పెట్టుకుంది. అలాగే తమ లోన్‌ బుక్‌ను గృహ ఋణాలు, చిన్న వ్యాపార ఋణాలు, ఆటో ఋణాలు వంటి వాటి ద్వారా మరింతగా వృద్ధి చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది.