పోస్టాఫీసుల్లో పాస్‌పోర్టు సేవలు.. త్వరలోనే ఈ-పాస్ పోర్టుల కోసం సన్నాహాలు: వీకే సింగ్
పాస్ పోర్టులను జిల్లా హెడ్ పోస్టాఫీసుల్లో పొందేలా విదేశీ వ్యవహారాల శాఖ చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రజలకు అనుగుణంగా పాస్ పోర్టు సేవలను సరళీకృతం చేసే దిశగా తపాలాశాఖలో కూడా పాస్ పోర్టు సేవలను అందు
పాస్ పోర్టులను జిల్లా హెడ్ పోస్టాఫీసుల్లో పొందేలా విదేశీ వ్యవహారాల శాఖ చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రజలకు అనుగుణంగా పాస్ పోర్టు సేవలను సరళీకృతం చేసే దిశగా తపాలాశాఖలో కూడా పాస్ పోర్టు సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు విదేశీ వ్యవహారాల శాఖాధికారులు ఫిబ్రవరిలో ప్రకటన చేశారు. తద్వారా విదేశీ వ్యవహారాల శాఖ తపాలా శాఖతో కలిసి పనిచేయడం ఇదే తొలిసారని అధికారులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో త్వరలోనే ఈ-పాస్ పోర్టులకు రంగం సిద్ధం అవుతుంది. ఇందులో భాగంగా ఈ-పాస్ పోర్టు సేవల కోసం తగిన సన్నాహాలను ప్రారంభించామని విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ వెల్లడించారు. రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ, పాస్ పోర్టులకు మరిన్ని భద్రతా ప్రమాణాలు ఉండేందుకుగాను చిప్ ఆధారిత ఈ-పాస్ పోర్టులను తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.
ఈ క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా టెండర్లు పిలిచే బాధ్యతను నాసిక్‌లోని ఇండియా సెక్యూరిటీ ప్రెస్‌కు అప్పగించినట్లు తెలిపారు. ఈ విధానం అమల్లోకి వస్తే దరఖాస్తుదారుల వ్యక్తిగత వివరాలు, డిజిట్ సంతకం ఆ చిప్‌లో ఉంటాయని వీకే సింగ్ తెలిపారు.