శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 17 డిశెంబరు 2016 (14:34 IST)

దిగిపోయే ప్రసక్తే లేదు.. టాటా ట్రస్టుల ఛైర్మన్‌గా కొనసాగుతా : రతన్ టాటా

టాటా ట్రస్టుల ఛైర్మన్‌గా కొనసాగుతానని, రాజీనామా చేసే ప్రసక్తే లేదని రతన్ టాటా స్పష్టం చేశారు. కొన్ని ఆంగ్ల పత్రికల్లో వచ్చిన కథనాల నేపథ్యంలో ఆయన పైవిధంగా స్పందించారు. ట్రస్టీలు భవిష్యత్‌ నాయకత్వం కోసం

టాటా ట్రస్టుల ఛైర్మన్‌గా కొనసాగుతానని, రాజీనామా చేసే ప్రసక్తే లేదని రతన్ టాటా స్పష్టం చేశారు. కొన్ని ఆంగ్ల పత్రికల్లో వచ్చిన కథనాల నేపథ్యంలో ఆయన పైవిధంగా స్పందించారు. ట్రస్టీలు భవిష్యత్‌ నాయకత్వం కోసం ఇప్పటినుంచే నియామక ప్రక్రియను మొదలుపెట్టినట్లు మీడియా కథనాలు వెలువడ్డాయి. అయితే అలాంటిదేమీ లేదని రతన్‌ స్పష్టం చేశారు. 
 
దేశ ప్రయోజనాలపై సానుకూల ప్రభావం చూపే పలు కార్యకలాపాలను ట్రస్టులు చేపడతున్నాయని.. అందులో తన పాత్రను కొనసాగించాలని భావిస్తున్నట్టు ఆయన తెలిపారు. సరైన సమయంలో తన వారసుడి గురించి, నియామక ప్రక్రియ గురించి ఆలోచిస్తామని చెప్పారు.