మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 29 నవంబరు 2024 (16:44 IST)

ఏఎస్‌సిఐ అర్ధ-వార్షిక ఫిర్యాదుల నివేదిక 2024-25లో రియల్ ఎస్టేట్, ఆఫ్‌షోర్ బెట్టింగ్ ప్రకటనలే అత్యధికం

buildings
రియల్ ఎస్టేట్, ఆఫ్‌షోర్ బెట్టింగ్ రంగాలలో తప్పుదోవ పట్టించే, చట్టవిరుద్ధ ప్రకటనల గణనీయ ఉనికిని వెల్లడిస్తూ 2024-25 అర్ధ-వార్షిక ఫిర్యాదుల నివేదికను అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఏఎస్‌సిఐ) విడుదల చేసింది. ఏప్రిల్- సెప్టెంబర్ 2024 మధ్య కాలంలో ఏఎస్‌సిఐ 4016 ఫిర్యాదులను సమీక్షించింది. 3031 ప్రకటనలను పరిశోధించింది; సమీక్షించబడిన ఈ ప్రకటనల్లో 98% వాటికి కొంత సవరణ అవసరం. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై ఏఎస్‌సిఐ నిరంతర నిఘాలో మొత్తం 2830 ప్రకటనలు ప్రాసెస్ చేయబడ్డాయి. ఇది మొత్తం స్వీకరించిన యాడ్‌లలో 93% మొత్తానికి ప్రాతినిధ్యం వహిస్తుంది.
 
పరిశోధించిన ప్రకటనలలో, 2087 ప్రకటనలు చట్టాన్ని ఉల్లంఘించాయి. వీటిలో, 1027 ఏఎస్‌సిఐ, మహారాష్ట్ర రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (మహారెరా) మధ్య జరిగిన అవగాహన ఒప్పందం ప్రకారం మహారెరాకి నివేదించబడ్డాయి. అక్రమ బెట్టింగ్‌ను ప్రోత్సహించే మరో 890 ప్రకటనలు సమాచార & ప్రసార మంత్రిత్వ శాఖ (MIB)కి నివేదించబడ్డాయి. డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ (DMR) చట్టాన్ని ఉల్లంఘిస్తూ రూపొందిన 156 ప్రకటనలు ఆయుష్ మంత్రిత్వ శాఖకు నివేదించబడ్డాయి; మద్యాన్ని నేరుగా ప్రచారం చేసే 10 ప్రకటనలు, డీప్‌ఫేక్‌లకు సంబంధించి మరో నాలుగు ప్రకటనలు MIBకి నివేదించబడ్డాయి.
 
అధికారికంగా పరిశోధించబడిన మిగిలిన 944 కేసులలో, 53% ప్రకటనలు, ఏఎస్‌సిఐ నుండి ఫిర్యాదు స్వీకరణ సమాచారం అందిన తరువాత ప్రకటనకర్త ద్వారా సవాలు చేయబడలేదు. రియల్టీ (34%), చట్టవిరుద్ధమైన బెట్టింగ్ (29%), ఆరోగ్య సంరక్షణ (8%), వ్యక్తిగత సంరక్షణ (7%),   ఆహారం & పానీయాలు (6%) అత్యధిక కోడ్ ఉల్లంఘనలతో మొదటి ఐదు విభాగాలుగా ఉన్నాయి.
 
నివేదికలోని ముఖ్యాంశాలు
అత్యంతగా ఉల్లంఘించే రంగంగా రియల్ ఎస్టేట్ రంగం ఉద్భవించింది, విచారణ చేయబడిన కేసులలో వీటి వాటా 34%గా ఉంది.
2115 రియల్ ఎస్టేట్ ప్రకటనలు సమీక్షించబడ్డాయి, మహారెరా చట్టం సంభావ్య ఉల్లంఘనలకు సంబం ధించి1027 ప్రాసెస్ చేయబడ్డాయి.
 
ప్రాసెస్ చేయబడిన వాటిలో 99% ప్రకటనలు మహారెరా చట్టాన్ని ఉల్లంఘించినవి. మునుపటి మీడియా నివేదికల ప్రకారం, ఏఎస్‌సిఐ ద్వారా గుర్తించబడిన ప్రకటనల ఫలితంగా మహారెరా 628 డెవలపర్లకు  మొత్తం ₹88.9 లక్షల జరిమానా విధించింది.
 
మహారెరాతో ఏఎస్‌సిఐ భాగస్వామ్యం రియల్ ఎస్టేట్ ప్రకటనలపై ప్రభావాన్ని సృష్టిస్తోంది, స్వీయ-నియం త్రణ, నియంత్రణ సంస్థ ఉమ్మడి ప్రయత్నాల ప్రభావాన్ని ప్రదర్శిస్తోంది.
 
చట్టవిరుద్ధమైన ఆఫ్‌షోర్ బెట్టింగ్‌ను ప్రోత్సహించే ప్రకటనలు ప్రధాన ఆందోళనగా కొనసాగాయి, ప్రాసెస్ చేయబడిన ప్రకటనలలో ఇవి 29% దాకా ఉన్నాయి.
 
890 ప్రకటనలు చట్టవిరుద్ధమైన ఆఫ్‌షోర్ బెట్టింగ్ ప్లాట్‌ఫామ్‌లను ప్రోత్సహించడం, ఫ్యాన్ పేజీలు, టిక్కర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్‌ల వంటి డిజిటల్ స్పేస్‌లను ఉపయోగించుకోడానికి సంబంధించి సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ (MIB)కి తెలియచేయబడ్డాయి. నియంత్రణ సంస్థ జోక్యం తర్వాత ప్లాట్‌ఫామ్‌ల ద్వారా అనేక పేజీలు తీసివేయబడ్డాయి, స్వీయ-నియంత్రణ, ప్రభుత్వ నియంత్రణ సంస్థల మధ్య సమర్థవంతమైన సమన్వయాన్ని ఇది మళ్లీ చాటిచెబుతోంది.
 
చట్టవిరుద్ధమైన బెట్టింగ్‌కు సంబంధించి తెలియజేయబడిన 890 ప్రకటనలలో, 831 ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లు. ఇవి ఫ్యాన్, కమ్యూనిటీ పేజీలలో ప్రదర్శించబడే టిక్కర్‌లు, ట్యాగ్‌ల రూపంలో వినియోగదారులను ఆఫ్‌షోర్ బెట్టింగ్ ప్లాట్‌ఫామ్‌లకు మళ్లించాయి. అంతేగాకుండా ఏఎస్‌సిఐ 50 వెబ్‌సైట్‌లు/సోషల్ మీడియా పేజీలు, అక్రమ బెట్టింగ్ యాప్‌లు, ప్లాట్‌ఫామ్‌లను ప్రచారం చేసే 9 ఇన్‌ఫ్లుయెన్సర్ పోస్ట్‌లను గుర్తించింది.
 
గ్రీన్‌వాషింగ్ క్లెయిమ్‌ చేసే ప్రకటనలు:
మొత్తం 100 ప్రకటనలు సమీక్షించబడ్డాయి, వాటిలో 99% ఏఎస్‌సిఐ ప్రోయాక్టివ్ మానిటరింగ్ ద్వారా గుర్తించబడ్డాయి. తప్పుదారి పట్టించే గ్రీన్ క్లెయిమ్స్ కారణంగా వాటిలో ప్రతి ఒక్క ప్రకట నకు సవరణలు అవసరం.
 
28% కేసులు ఏఎస్‌సిఐ కోడ్‌ను పాటించనందుకు సమాచార & ప్రసార మంత్రిత్వ శాఖకు నివేదించబడ్డాయి. అటువంటి ప్రకటనలు సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ విడుదల చేసిన ఇటీవలి మార్గదర్శకాలను కూడా ఉల్లంఘించే అవకాశం ఉందని గమనించవచ్చు.
 
ఎలాంటి సవాలు లేకుండా ఫిర్యాదులను పరిష్కరించుకోడానికి ఎక్కువమంది ప్రకటనదారులు స్వచ్ఛందంగా ముందుకు రావడంతో, ఏఎస్‌సిఐ దాని సగటు టర్నరౌండ్ సమయాన్ని 30 నుండి 18 రోజులకు తగ్గించింది. ఇది మెరుగైన సామర్థ్యం, వేగానికి దారితీసింది, ఏఎస్‌సిఐ అధిక స్థాయి ఉల్లంఘనలపై దృష్టి పెట్టడానికి వీలు కల్పిస్తుంది.
 
ఏఎస్‌సిఐ సీఈఓ మనీషా కపూర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, "బెట్టింగ్, రియల్టీ వంటి రంగాలలో ప్రభుత్వ నియంత్రణ సంస్థల భాగస్వామ్యంతో మా పని ప్రభావం చూపుతోంది. చేయాల్సింది ఇంకా చాలా ఉన్నప్పటికీ, ఇటువంటి భాగస్వామ్యాలు మెరుగైన పర్యవేక్షణ కోసం ప్రేరణను సృష్టించగలవు. గ్రీన్‌వాషింగ్ అనేది 2024లో మేము మార్గదర్శకాలను విడుదల చేసిన మరొక విభాగం. ఇది కూడా మేం ప్రధానంగా దృష్టి పెట్టిన రంగం. ఇది ఫిర్యాదుల నిర్వహణకు సంబంధించి మా టర్న్-అరౌండ్ సమయాన్ని తగ్గించడంలో సుస్థిరమైన పురోగతితో ఏఎస్‌సిఐ ప్రగాఢ అనుభవం, సాంకేతిక మద్దతు గల ప్రయత్నాలు భారతదేశ వినియోగదారులకు మెరుగైన రక్షణను అందించడానికి అభివృద్ధి చెందుతున్నాయి’’ అని అన్నారు.