ఆదివారం, 24 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 30 అక్టోబరు 2024 (13:21 IST)

అమరావతిలో రియల్ ఎస్టేట్ పరిశ్రమ పుంజుకుంటోందా?

amaravati
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమరావతి రాజధానిలో భూముల ధరలకు రెక్కలు వస్తాయనే ప్రచారం జరిగింది. ఈ ప్రచారంలో కాస్తంత నిజం వుంది కానీ అనుకున్నంత స్థాయిలో పరుగులు పెట్టడంలేదని అంటున్నారు. గత వైసిపి పాలన కంటే ప్రస్తుతం అమరావతిలో కనీసం 50 శాతం మేర భూముల ధరలు పెరిగినట్లు చెబుతున్నారు. ఇది కూటమి ప్రభుత్వం అధికారం పగ్గాలు చేపట్టగానే వచ్చిన మార్పు.
 
ఐతే ఇప్పుడిప్పుడు ప్రభుత్వం అమరావతిలో రోడ్లు, మౌలిక సదుపాయాలపై దృష్టి సారించింది. ఈ ఏడాది చివరి నాటికి అమరావతిలో పూర్తిస్థాయి పనులను ప్రభుత్వం ప్రారంభిస్తుందని సమాచారం. కాగా ప్రైవేట్ సంస్థలు మాత్రం ఇప్పటికే గతంలో నిర్మించి ఆపేసిన కట్టడాలకు మళ్లీ మెరుగులు దిద్దే పనిలో పడ్డాయి. క్రమంగా అమరావతి అభివృద్ధిపై అడుగులు ముందుకు పడుతూ వుండటంతో ఇక రియల్ ఎస్టేట్ రంగం ఇక్కడ పూర్తిస్థాయిలో ఊపందుకుంటుందని అంచనా వేస్తున్నారు.