శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 23 జూన్ 2017 (13:23 IST)

రూ.45వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిన అనిల్ అంబానీ

అనిల్ అంబానీ రూ.45కోట్ల అప్పుల్లో కూరుకుపోయారని వార్తలొస్తున్నాయి. రిలయన్స్ కమ్యూనికేషన్స్ సంస్థ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని జాతీయ మీడియా కోడైకూస్తోంది. టెక్నాలజీ విభాగంలోని అన్నీ శాఖల్లో రిలయన్స్ కమ్

అనిల్ అంబానీ రూ.45కోట్ల అప్పుల్లో కూరుకుపోయారని వార్తలొస్తున్నాయి. రిలయన్స్ కమ్యూనికేషన్స్ సంస్థ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని జాతీయ మీడియా కోడైకూస్తోంది. టెక్నాలజీ విభాగంలోని అన్నీ శాఖల్లో రిలయన్స్ కమ్యూనికేషన్స్ వ్యాపారం చేస్తోంది. అయితే రిలయన్స్ కమ్యూనికేషన్స్ సంస్థకు రూ.45వేల కోట్ల అప్పు ఉన్నట్లు సమాచారం. ఈ మొత్తాన్ని రిలయన్స్ సంస్థ డిసెంబరులోపు చెల్లించాల్సి వుందట. 
 
ఎయిర్ సెల్, బ్రూక్ ఫీల్డ్ అనే సంస్థలు చేసుకున్న ఒప్పందాల ద్వారా 60శాతం అప్పు తీరే అవకాశం ఉన్నట్లు అనిల్ అంబానీ భావిస్తున్నారు. ఇంకా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్ ఛైర్మన్ అనిల్ అంబానీ వేతనం లేకుండా పనిచేయనున్నట్లు ప్రకటించారు. ఏడు నెలల గడువులో ఎయిర్ సెల్, బ్రూక్ ఫీల్డ్ సంస్థల ఒప్పందంతో 60 శాతం అప్పు తగ్గుతుందని, రూ.25వేల కోట్లను సిద్ధం చేసే పనుల్లో ఉన్నట్లు తెలిపారు.