సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By
Last Updated : గురువారం, 25 ఏప్రియల్ 2019 (16:26 IST)

రూ.600కే అన్ని సేవలు .. రిలయన్స్ జియో న్యూఆఫర్

దేశ ప్రజలకు రిలయన్స్ జియో సరికొత్త సేవలు అందుబాటులోకి తీసుకునిరానుంది. కేవలం 600 రూపాయలకే బ్రాడ్‌బ్యాండ్, ల్యాండ్‌లైన్, టీవీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. అయితే, ఈ సేవలు కేవలం ఎంపిక చేసిన ప్రాంతాల్లో పరీక్షించనున్నారు. 
 
ప్ర‌స్తుతం ఈ సేవ‌ల‌ను విడివిడిగా తీసుకుంటే ఎంత లేద‌న్నా నెల‌కు రూ.1500 నుంచి రూ.2 వేల వ‌ర‌కు అవుతుంది. అదే జియోలో అయితే కేవ‌లం రూ.600 బేసిక్ ప్లాన్ తీసుకుంటే చాలు. దీంతో వినియోగ‌దారుల‌కు పెద్ద ఎత్తున డ‌బ్బు ఆదా అవుతుంది. ఇక జియో గిగాఫైబ‌ర్‌లో అందించే బ్రాడ్‌బ్యాండ్‌తో ఏకంగా 40 డివైస్‌ల వ‌ర‌కు ఇంటర్నెట్‌కు క‌నెక్ట్ చేసుకోవ‌చ్చ‌ని తెలిసింది. 
 
ఈ సేవ‌ల‌ను పొందాలంటే ముందుగా రూ.4500 రీఫండ‌బుల్ సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సి వ‌స్తుంద‌ని స‌మాచారం. ఇక ఈ సేవ‌ల ద్వారా నెల‌కు 100 జీబీ వ‌ర‌కు ఉచిత డేటా క‌స్ట‌మ‌ర్ల‌కు ల‌భించ‌డంతోపాటు నెట్‌స్పీడ్ గ‌రిష్టంగా 100 ఎంబీపీఎస్ వ‌ర‌కు వ‌స్తుంద‌ని తెలిసింది. కాగా, జియో గిగాఫైబ‌ర్ సేవ‌లు ఎప్ప‌టి నుంచి ప్రారంభ‌మ‌వుతాయ‌న్న అంశంపై మాత్రం ఇప్పటివరకు క్లారిటీ రాలేదు.