ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : గురువారం, 31 ఆగస్టు 2023 (17:15 IST)

బాలికలు ఫుట్ బాల్ ఆడేలా అవకాశాలను అందించేందుకు ఫిఫాతో కలిసి రెక్సోనా ‘బ్రేకింగ్ లిమిట్స్: గర్ల్స్ కెన్’ సిరీస్‌

image
మహిళల ఫుట్‌బాల్ లక్ష్యాలకు అనుగుణంగా, ప్రపంచంలోని నంబర్ 1 డియోడరెంట్ బ్రాండ్ అయినటువంటి రెక్సోనా భారతదేశంలో 'బ్రేకింగ్ లిమిట్స్: గర్ల్స్ కెన్' సిరీస్‌ను ప్రారంభించింది. దీని ద్వారా ఎక్కువ మంది మహిళా ఫుట్ బాల్ ప్లేయర్స్ కు మరింత శక్తిని ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఉద్యమానికి జీవితాలను మార్చే శక్తి ఉందని రెక్సోనా నమ్ముతుంది, అయితే ప్రతి ఒక్కరికి వారు అనుకున్న లక్ష్యాలను అందుకునే అవకాశాలు రాకపోవచ్చు. ఇలాంటి సమయంలో రెక్సోనా లక్ష్యం కేవలం డియోడరెంట్ గా ఉండిపోవడమే కాదు, ఇది మహిళా ఫుల్ బాల్ ప్లేయర్లలో విశ్వాసాన్ని పునర్నిర్మించడానికి మరియు మార్పును పెంపొందించడానికి ప్రయత్నిస్తుంది.
 
అనుకున్న ఈ లక్ష్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు, [రెక్సోనా] బ్రేకింగ్ లిమిట్స్ కార్యక్రమాన్ని పరిచయం చేస్తోంది. ఉద్యమ-ఆధారిత కార్యక్రమాల ద్వారా యువతలో విశ్వాసం మరియు అవకాశాలను పెంపొందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా వారిని సన్నద్ధం చేసేందుకు కోచ్‌లు, కమ్యూనిటీ నాయకులు మరియు మెంటర్‌లను మెరుగుపరచడం లక్ష్యంగా ఉచిత డిజిటల్ శిక్షణా సిరీస్ ను అందిస్తుంది. కొత్తగా చేపట్టిన గర్ల్స్ కెన్ సిరీస్ కూడా బాలికలకు సురక్షితమైన వాతావరణాన్ని నెలకొల్పడం, ఆత్మగౌరవాన్ని పెంపొందించడం మరియు అన్ని జాతులను కలుపుకుని పోయేలా చేయడంపై దృష్టి పెడుతుంది.
 
రెక్సోనా కొత్త క్యాంపెయిన్ ఈ వారంలో మొదలవుతుంది. ఆశ్చర్యకరంగా, భారతదేశంలో 1% కంటే తక్కువ మంది బాలికలు ఫుట్‌బాల్‌ ఆడుతున్నారు*. కోల్‌కతాలోని ఒక ఉద్వేగభరితమైన ఆర్ట్ ఇన్‌స్టాలేషన్ ఈ అసమానతను చాటిచెప్పింది. అది ఎలా అంటే 100 తెల్లని జెర్సీని ఉన్నచోట ఒకే ఒక్క పింక్ రంగు జెర్సీ ఉన్నట్లుగా తయారైంది పరిస్థితి. ఇన్‌స్టాలేషన్‌లో నిమగ్నమైన అదితి చౌహాన్ (జాతీయ భారత మహిళల జట్టుకు గోల్‌కీపర్) లాంటి ఇన్‌ఫ్లుయెన్సర్‌లు సందేశాన్ని అందించారు.
 
సంధ్యా డైసీ సుందరం ఈ ప్రచార వీడియోకు దర్శకత్వం వహించారు. కొంతమంది మహిళలు మాత్రమే చాలా అరుదుగా అవకాశాలను అందిపుచ్చుకునే లక్షణాల్ని కలిగిన సమాజం మనది. ఇలాంటి చోట సమాన అవకాశాలను పొందడంలో బాలికల సవాళ్లను హైలైట్ చేస్తూ, ఫుట్‌బాల్ ఆడుతున్న అబ్బాయిలను అలా చూస్తూ ఉండిపోతున్న యువతుల వాస్తవ కథలను చెబుతుంది. ఆర్ట్ ఇన్‌స్టాలేషన్ వారి జ్ఞాపకాలు, భావోద్వేగాలు మరియు విజయాల ద్వారా లోతైన అనుభవాన్ని రేకెత్తిస్తాయి.
 
జాతీయ భారత మహిళల జట్టు గోల్‌కీపర్ అదితి చౌహాన్ మాట్లాడుతూ... “రెక్సోనా ఇండియాతో భాగస్వామిగా ఉండటంతో యువతులు ఏమాత్రం సంకోచం లేకుండా ఫుట్‌బాల్ మైదానంలోకి అడుగుపెట్టేలా ప్రేరేపించడం నాకు చాలా ఆనందంగా ఉంది. దీనిద్వారా అడ్డంకులు బద్దలు కొట్టడం మరియు సామాజిక నిబంధనల నుండి దూరంగా వెళ్లడానికి బాలికలకు మార్గాలను సృష్టించడం లాంటి నా లక్ష్యాలకు అనుగుణంగా ఉంటుంది. ప్రతి అమ్మాయి క్రీడ పట్ల ఉన్న అభిరుచికి ప్రోత్సాహం, ప్రేరణ, మార్గదర్శకత్వం మరియు అవకాశాలతో కూడిన భవిష్యత్తును మనం పెంపొందించుకోవచ్చు అని అన్నారు.
 
హెడ్ ఇండియా ఓరల్ కేర్ మరియు డియోస్ శ్రీ అశ్వత్ స్వామినాథన్ మాట్లాడుతూ... “రెక్సోనాలో, క్రీడల యొక్క పరివర్తన శక్తిని విశ్వసిస్తున్నాము. ఫుట్‌బాల్ అడ్డంకులను ఛేదించడానికి మరియు యువతులకు సాధికారత కల్పించడానికి ఒక అద్భుతమైన వేదికగా పనిచేస్తుంది. ఆడపిల్లలను ఫుట్‌బాల్ ఆడేలా ప్రేరేపించాలనే మా నిబద్ధత, వారు ఇతరులకు సమానమైన అవకాశాలకు మరియు గుర్తింపుకు అర్హులు అనే దృఢ నిశ్చయంతో నడుపబడుతోంది. మా కార్యక్రమాల ద్వారా, ఈ ప్రయాణంలో వారు ఎప్పుడూ ఒంటరిగా లేరని గుర్తుచేస్తూ, ఈ యువ మహిళా అథ్లెట్‌లను మరింతగా అభివృద్ధి చేయాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము. ఇందుకోసం రెక్సోనా ఒక మద్దతుదారుగా నిలుస్తుంది, అమ్మాయిలు పెద్దగా కలలు కనేలా, వారి హృదయాలను బయటపెట్టి, ఎలాంటి పరిమితికి మించి గొప్పతనాన్ని సాధించగలరని ప్రదర్శించేలా ప్రేరేపిస్తుంది అని అన్నారు.
 
 రెక్సోనా గ్లోబల్ బ్రాండ్ వైస్ ప్రెసిడెంట్ కేథ్రిన్ స్వాలో మాట్లాడారు. "ప్రపంచంలోని ప్రముఖ యాంటిపెర్స్పిరెంట్ మరియు దుర్గంధనాశని బ్రాండ్ మాది. ప్రతి అమ్మాయికి ఫుట్‌బాల్ ఆడే అవకాశం మరియు విశ్వాసం ఉన్న ప్రపంచాన్ని సృష్టించడానికి మేము అంకితభావంతో ఉన్నాము. ఫుట్‌బాల్ యొక్క ఏకీకృత సంభావ్యత అపారమైనది, మరియు ఐక్యతను ప్రేరేపిస్తుంది. అందుకే భారతదేశంలో బ్రేకింగ్ లిమిట్స్ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టడం పట్ల మేము సంతోషిస్తున్నాము, ఈ దృక్పథం వైపు మా నిశ్చయమైన పురోగతిని సూచిస్తుంది" అని అన్నారు.