శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 14 డిశెంబరు 2018 (13:12 IST)

వాజ్‌పేయి ఫోటోతో రూ.100 నాణెం...

మాజీ ప్రధాని, దివంగత భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి ముఖచిత్రం (ఫోటో)తో త్వరలో వంద రూపాయల నాణెం విడుదలకానుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నాణెంపై వాజ్‌పేయి ఫోటోతో పాటు ఆయన పుట్టిన, మరణించిన తేదీలు ఉంటాయి. ఈ కాయిన్‌పై వాజ్‌పేయి పేరును దేవనగరి లిపితో పాటు ఆంగ్లంలో లిఖించనున్నారు. 
 
ఈ కాయిన్‌కు మరోవైపు, అశోక సారనాథ్ స్తంభాలైన నాలుగు సింహాలు ఉండనున్నాయి. దానికింద సత్యమేవ జయతే అన్న వాక్యం దేవనాగరి లిపిలో లిఖించబడి ఉంటుంది. దాని కిందే "భారత్" అని నాణేనికి ఇరువైపులా లిఖించబడి ఉంటుంది. వాజ్‌పేయి గౌరవార్థం ఆయన పేరు మీద ప్రభుత్వం ఈ కాయిన్ తీసుకురాబోతోంది. ఇప్పటికే పలు ప్రాంతాలకు ప్రభుత్వం ఆయన పేరును కూడా పెట్టిన సంగతి తెలిసిందే. ఛత్తీస్‌గఢ్‌లోని నయారాయాపూర్‌ పేరును అక్కడి ప్రభుత్వం అటల్‌నగర్‌గా గత బీజేపీ ప్రభుత్వం మార్చింది కూడా.