ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 25 ఫిబ్రవరి 2017 (18:29 IST)

ఆర్థిక కష్టాల్లో స్నాప్‌డీల్.. 600 మంది ఉద్యోగులకు పింక్ స్లిప్‌లు అందాయ్!

ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ స్నాప్‌డీల్ ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయింది. ఆ నష్టాన్ని పూరించేందుకు ఉద్యోగులపై వేటు వేయనుంది. ఇందులో భాగంగా 600 మంది ఉద్యోగులను తొలగించేందుకు పింక్ స్లిప్ జారీ చేశారని వార్తలు

ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ స్నాప్‌డీల్ ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయింది. ఆ నష్టాన్ని పూరించేందుకు ఉద్యోగులపై వేటు వేయనుంది. ఇందులో భాగంగా 600 మంది ఉద్యోగులను తొలగించేందుకు పింక్ స్లిప్ జారీ చేశారని వార్తలు వస్తున్నాయి. పింక్ నోటీసులు జారీ చేయడంతో ఆయా ఉద్యోగులు తమ వద్ద ల్యాప్‌టాప్, గుర్తింపు కార్డుల్ని తిరిగి ఇచ్చేస్తున్నారు. 
 
స్నాప్‌డీల్‌లో నెలకొన్న అనిశ్చితికి ప్రధాన కారణం వృద్ధి మందగమనమని.. ఇతర పోటీ సంస్థలైన ఫ్లిప్‌కార్ట్, అమేజాన్ స్థాయిలో స్నాప్ డీల్ లాభాలను ఆర్జించలేకపోయిందని ఉద్యోగులు చెప్తున్నారు. మార్చి చివరి వరకు దశల వారీగా ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుందని ఓ ఉద్యోగి చెప్పారు. కానీ స్నాప్ ‌డీల్ కార్యాలయాలను మూసివేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని.. స్నాప్ డీల్ సంస్థకు చెందిన ఓ ఉద్యోగి వెల్లడించారు.