శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 2 ఫిబ్రవరి 2016 (17:28 IST)

యువత కోసం సరికొత్త గృహ రుణ పథకం.. ఎస్.బి.ఐ ఫ్లెక్సీ‌పే హోం లోన్

సాఫ్ట్‌వేర్ యువతను లక్ష్యంగా చేసుకుని భారతీయ స్టేట్ బ్యాంకు సరికొత్త రుణ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. ఎస్.బి.ఐ ఫ్లెక్సీపే హోంలోన్ పేరుతో ఈ స్కీమ్‌ను ముంబైలో ఆ బ్యాంకు ఛైర్మన్ అరుంధతీ భట్టాచార్య ప్రారంభించగా, చెన్నైలో చీఫ్ జనరల్ మేనేజర్ పి. రమేష్ బాబు, జనరల్ మేనేజర్ జి రవీంద్రనాథ్, ఇందూ శేఖర్ దత్తూలు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. 
 
నేటి యువత మంచి ఉద్యోగంలో చేరిన తర్వాత ఒక ఇల్లు కొనాలన్న కోర్కె కలుగుతుందని, ఇలాంటి వారిని లక్ష్యంగా చేసుకుని ఈ కొత్త స్కీమ్‌ను ప్రవేశపెట్టినట్టు చెప్పారు. కేవలం రెండేళ్ళ పని అనుభవం ఉండి, 21 యేళ్లు పూర్తయిన యువ ఉద్యోగులు ఈ స్కీమ్‌ కింద గృహ రుణ సదుపాయం పొందే అవకాశం ఉందన్నారు. 21 యేళ్ల నుంచి 45 యేళ్ళ వరకు ఈ రుణం పొందవచ్చన్నారు.
 
 
అంతేకాకుండా, ఇతర గృహ రుణాలకు ఇచ్చినట్టుగానే ఈ కొత్త స్కీమ్‌లో కూడా మహిళలకు 9.50 శాతం, ఇతరులకు 9.55 శాతం వడ్డీకి రుణం అందిస్తామని తెలిపారు. ఈ రుణాన్ని 25 యేళ్ల నుంచి 30 యేళ్ళలోపు తిరిగి చెల్లించవచ్చన్నారు. కనిష్టంగా 20 లక్షల రూపాయల మేరకు రుణం పొందవచ్చని వెల్లడించారు. 
 
ఈ స్కీమ్‌ కింద రుణం తీసుకునే వారు.. తొలి మూడేళ్ళ పాటు కేవలం వడ్డీని మాత్రమే చెల్లించవచ్చని, ఐదేళ్ళ తర్వాతే అసలు చెల్లించే వెసులుబాటు ఉంటుందని వారు వివరించారు. కాగా, ఈ స్కీమ్ కింద రుణ సదుపాయం పొందిన 8 మందికి రుణ మంజూరు పత్రాలను కూడా వారు అందజేశారు.