ఆదివారం, 29 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 13 సెప్టెంబరు 2021 (08:35 IST)

మగువలకు శుభవార్త : తగ్గిన బంగారం ధరలు

దేశంలోని మగువలకు ఇది నిజంగానే శుభవార్త. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా బంగారం ధ‌ర‌లు భారీగా త‌గ్గుముఖం ప‌ట్టాయి. హైద‌రాబాద్ బులియ‌న్ మార్కెట్లో ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. 
 
10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.10 తగ్గి రూ.43,990 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.10 తగ్గి రూ.47,990కి చేరిది. దేశీయంగా మార్కెట్లు తిరిగి క్రమంగా పుంజుకోవ‌డంతో బంగారం ధ‌ర‌లు తగ్గుముఖం ప‌డుతున్నాయి. ఇక బంగారం ధ‌ర‌లు తగ్గితే… వెండి ధ‌ర‌లు మాత్రం స్థిరంగా ఉన్నాయి. కిలో వెండి ధ‌ర రూ.64,200 వ‌ద్ద కొనసాగుతోంది.