గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 8 సెప్టెంబరు 2021 (09:07 IST)

10 గ్రాముల బంగారంపై రూ.110 తగ్గుదల

దేశంలో బంగారం ధరల క్రమంగా తగ్గుతున్నాయి. గ‌త కొన్ని రోజులుగా పెరుగుతూ, కొద్దిగా తగ్గుతూ వ‌చ్చిన బంగారం ధ‌ర‌ల్లో బుధవారం పెద్ద మార్పులు సంభవించాయి. 
 
దేశీయంగా మార్కెట్లు తిరిగి క్రమంగా పుంజుకోవ‌డంతో బంగారం ధ‌ర‌లు తగ్గుముఖం ప‌డుతున్నాయి. అటు అంత‌ర్జాతీయంగా కూడా బంగారం ధ‌ర‌లు కొంత‌మేర తగ్గడంతో ఆ ప్రభావం దేశీయ మార్కెట్ల‌పై ప‌డింది. 
 
హైద‌రాబాద్ బులియ‌న్ మార్కెట్లో ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.110 తగ్గి రూ.44,400కి చేరింది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.120 తగ్గి రూ.48,440కి చేరింది. ఇక బంగారం ధ‌ర‌లతో పాటుగా వెండి ధ‌ర‌లు కూడా తగ్గాయి. కిలో వెండి ధ‌ర రూ.200 తగ్గి రూ.69,600 వ‌ద్ద కొనసాగుతోంది.