పండుగ సీజన్ కోసం టొయోటా నుంచి అర్బన్ క్రూయిజర్ టైజర్ ప్రత్యేకమైన లిమిటెడ్ ఎడిషన్ విడుదల
పండుగ ఉత్సాహానికి మరింత సంతోషం జోడిస్తూ, టొయోటా కిర్లోస్కర్ మోటార్ (టికెఎం) ఈరోజు తమ అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్-అర్బన్ క్రూయిజర్ టైజర్ యొక్క లిమిటెడ్ ఎడిషన్‌ను విడుదల చేసినట్లు ప్రకటించింది. ఈ ప్రత్యేక ఎడిషన్, స్టైల్, ప్రీమియం-నెస్‌ని మెరుగుపరచడంపై దృష్టి సారించి రూపొందించబడింది, కస్టమర్‌లకు మరింత ఆనందం ఇస్తూ ఈ పరిమిత ఎడిషన్ రూ. 20,160 విలువ కలిగిన టొయోటా జెన్యూన్ యాక్సెసరీస్ (టిజిఏ) ప్యాకేజీతో వస్తుంది.
టొయోటా కిర్లోస్కర్ మోటార్, సేల్స్-సర్వీస్-యూజ్డ్ కార్ బిజినెస్ వైస్ ప్రెసిడెంట్ శబరి మనోహర్ మాట్లాడుతూ , “టొయోటా వద్ద, మా ప్రయత్నాలు ఎల్లప్పుడూ మా కస్టమర్ల ప్రత్యేకత వేడుకలో భాగం కావడంపైనే కేంద్రీకృతమై ఉన్నాయి. అర్బన్ క్రూయిజర్ హైరైడర్ ఫెస్టివ్ ఎడిషన్‌ను ఇటీవలే పరిచయం చేసిన తర్వాత, ఈ పండుగ సీజన్ కోసం తాజా మరియు ఉత్తేజకరమైన జోడింపులు చేస్తూ అర్బన్ క్రూయిజర్ టైజర్ ఫెస్టివ్ ఎడిషన్‌ను అందించడానికి మేము సంతోషిస్తున్నాము. ఈ కొత్త జోడింపులో మా కస్టమర్‌లు గొప్ప విలువను పొందుతారని మేము విశ్వసిస్తున్నాము.." అని అన్నారు.