గురువారం, 28 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : బుధవారం, 9 జూన్ 2021 (17:47 IST)

అత్యంత సులభంగా శుభ్రపరుచుకునే డిజైన్‌ కలిగిన స్వచ్ఛ్‌ గ్యాస్‌ స్టవ్‌ను హైదరాబాద్‌లో విడుదల చేసిన టీటీకె ప్రెస్టిజ్‌

హైదరాబాద్: భారతదేశంలో అతిపెద్ద కిచెన్‌ అప్లయెన్సెస్‌ బ్రాండ్‌ టీటీకె ప్రెస్టిజ్‌ నేడు విప్లవాత్మకమైన స్వచ్ఛ్‌ గ్లాస్‌ టాప్‌ గ్యాస్‌ స్టవ్‌ను హైదరాబాద్‌లో విడుదల చేసింది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా అత్యంత సులభంగా శుభ్రపరుచుకోగలిగిన డిజైన్‌ కలిగిన ఈ స్టవ్‌ మెరుగైన క్లీనింగ్‌ అనుభవాలను అందిస్తుంది. ఈ గ్యాస్‌ స్టవ్‌లను టీటీకె ప్రెస్టిజ్‌ హోసూర్‌ ఫ్యాక్టరీలో తయారుచేస్తున్నారు.
 
ఈ గ్యాస్‌ స్టవ్‌ను భద్రతను దృష్టిలో పెట్టుకుని తీర్చిదిద్దారు. ఎలాంటి పగుళ్లు లేవని భరోసా అందించేందుకు అత్యంత కఠినమైన గ్లాస్‌ను వినియోగించారు. వంట చేసేటప్పుడు పాత్రలు కదలకుండా ఉండేందుకు ధృడమైన పాన్‌ మద్దతునందిస్తుంది.
 
ఈ ఆవిష్కరణ గురించి శ్రీ చంద్రు కల్రో, మేనేజింగ్‌ డైరెక్టర్‌- టీటీకె ప్రెస్టిజ్‌ మాట్లాడుతూ, ‘‘ఎన్నో దశాబ్దాలుగా గ్యాస్‌ స్టవ్‌లలో ఈ తరహా వినూత్న ఆవిష్కరణలు చూడలేదు. కిచెన్‌ అప్లయెన్సెస్‌ విభాగంలో మార్కెట్‌ అగ్రగామిగా ఈ విప్లవాత్మక గ్యాస్‌ స్టవ్‌ను ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా మార్కెట్‌లలో పరిచయం చేస్తుండటం పట్ల సంతోషంగా ఉన్నాము. మెరుగైన పనితీరు కలిగి  శైలి, సౌకర్యంలకు ప్రతిరూపంగా ఈ స్వచ్ఛ్‌ గ్లాస్‌ టాప్‌ గ్యాస్‌ స్టవ్‌ ఉంటుంది. వంటింటి ఇబ్బందులను తీర్చడంతో పాటుగా క్లీనింగ్‌లో ఎదురవుతున్న సమస్యలను తీర్చే ఈ నూతన గ్యాస్‌ స్టవ్‌ను వినియోగదారులు ఆదరిస్తారనే నమ్మకంతో ఉన్నాం...’’ అని అన్నారు.
 
ఈ గ్యాస్‌ స్టవ్‌లో వినూత్నమైన రీతిలో పైకి లేపగలిగిన బర్నర్‌ సెట్‌ మరియు డ్రిప్‌ ఫ్రీ డిజైన్‌ ఉంది. ఇది కిచెన్‌ ప్లాట్‌ఫార్మ్‌పై ఏమీ వెదజల్లకుండా కాపాడుతుంది. టీటీకె ప్రెస్టిజ్‌ యొక్క సిగ్నేచర్‌ బ్రాస్‌ బర్నర్లు మరియు జంబో బ్రాస్‌ బర్నర్స్‌ వేగవంతమైన కుకింగ్‌కు  భరోసా అందించడంతో పాటుగా ఎల్‌పీజీ వినియోగం పరంగా మెరుగైన సామర్థ్యమూ అందిస్తుంది.
 
ఈ ఐఎన్‌ఐ ధృవీకృత గ్లాస్‌ స్టవ్‌ 2,3 బర్నర్‌ మరియు 4బర్నర్‌ వేరియంట్స్‌లో లభ్యమవుతుంది. ఉత్పత్తిపై 2 సంవత్సరాలు, గ్లాస్‌పై 5 సంవత్సరాల వారెంటీతో ఇది వస్తుంది. ఈ స్వచ్‌ గ్లాస్‌ టాప్‌ గ్యాస్‌ స్టవ్‌ 8,995 రూపాయల నుంచి లభ్యమవుతుంది. పరిచయ ధరగా పరిమిత కాలం పాటు 7200 రూపాయలకు దీనిని అందిస్తారు.