శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 9 జూన్ 2021 (12:59 IST)

కఠిన లాక్డౌన్‌లోనూ ఆగని అవినీతి... వెల్లువెత్తిన ఫిర్యాదులు

కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన లాక్డౌన్‌ను అమలు చేస్తున్నాయి. ప్రజలకు అత్యవసర సేవల్లో అంతరాయం కలగకుండా ప్రభుత్వ కార్యాలయాల్లో పరిమిత సంఖ్యలో అధికారులు, సిబ్బంది విధులకు హాజరయ్యేలా ఆదేశాలు జారీ చేసింది. 
 
ఓ వైపు పరిస్థితి ఇలావుంటే లంచాలకు అలవాటు పడిన కొందరు ప్రభుత్వ ఉద్యోగులు ఇవేవీ పట్టించుకోకుండా పని కావాలంటే పైసలు ఇవ్వాల్సిందేనని డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో అవినీతిపై బాధితులు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కి ఫిర్యాదు చేస్తున్నారు. 
 
తమకు అందుతున్న ఫిర్యాదులపై అధికారులు ఆధారాలు సేకరిస్తున్నారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం డిమాండ్‌ చేస్తే ఏసీబీ టోల్‌ ఫ్రీ నెంబరు 1064కు ఫిర్యాదు చేయాలని అధికారులు తెలిపారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులు ఇష్టారాజ్యంగా చెలామణి అవుతున్నారే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.