శనివారం, 9 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: ఆదివారం, 25 ఆగస్టు 2024 (20:17 IST)

వేదాంత జింక్ సిటీ హాఫ్ మారథాన్ ప్రారంభానికి సిద్ధమైన ఉదయ్ పూర్ జింక్ నగరం

Vedanta Zinc City Half Marathon
హిందూస్థాన్ జింక్ లిమిటెడ్ వేదాంత జింక్ సిటీ హాఫ్ మారథాన్ ప్రారంభంతో ఆకలితో పోరాడటంలో అతి గొప్ప చర్య తీసుకోవడానికి సిద్ధమైంది. రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్‌లో అద్భుతమైన నేపధ్యంలో, ఈ ప్రారంభోత్సవపు మారథాన్ 29 సెప్టెంబర్ 2024 కోసం ప్రణాళిక చేయబడింది. అసోసియేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ మారథాన్స్, డిస్టెన్స్ రేసెస్ యొక్క అధికారిక సభ్యునిగా, ఈ కార్యక్రమం ఎయిమ్స్ ధృవీకరణ పొందింది. అంతర్జాతీయ మారథాన్ జాబితాలో స్థానం సంపాదించి అంతర్జాతీయ వేదికపై తన ప్రాధాన్యతను మరింత శక్తివంతం చేసింది. వేదాంత జింక్ సిటీ హాఫ్ మారథాన్ అందరికీ అందుబాటులో ఉంది.
 
అద్భుతమైన ఆరావళి పర్వత శ్రేణుల మద్దతుతో ప్రశాంతమైన ఫతే సాగర్ సరస్సు దగ్గరలో వేదాంత జింక్ సిటీ హాఫ్ మారథాన్ మార్గం ప్రత్యేకంగా నిలిచింది. పాల్గొంటున్న వారు ఉదయ్ పూర్ సుసంపన్నమైన వారసత్వం మార్గంలో దిగ్గజ కట్టడాలైన మహారాణా ప్రతాప్ స్మారక్, హరితదనం నిండిన సహేలియాన్ కి బారీ, గౌరవనీయమైన నీముచ్ మాతా మందిర్ పర్వతం వంటి వాటి నుండి ప్రయాణిస్తారు. హాఫ్ మారథాన్ ( 21 కిలో మీటర్లు), కూల్ రన్ ( 10 కిలో మీటర్లు), డ్రీమ్ రన్ ( 5 కిలో మీటర్లు)సహా శ్రేణులతో, ఈ కార్యక్రమం ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన రన్నర్స్, ప్రొఫెషనల్ మరియు ఔత్సాహిక రన్నర్స్‌కు మర్చిపోలేని అనుభవాన్ని వాగ్థానం చేస్తుంది.
 
జింక్ సిటీగా పేరు పొందిన ఉదయ్ పూర్ తమ మొదటి కార్యక్రమం మారథాన్‌ను నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం మంత్రముగ్ధులను చేసే ఈ నగరాన్ని సందర్శించడానికి అత్యంత రమణీయమైన సమయంగా నిలిచిన శరత్కాలం రాకను కూడా చాటుతోంది. మారథాన్ ఇతివృత్తం, రన్ ఫర్ జీరో హంగర్, సమాజానికి తిరిగి ఇచ్చే సిద్ధాంతంతో విస్తృతంగా అనుసరిస్తుంది, ఆకలితో పోరాడే విస్తృతమైన లక్ష్యాన్ని మద్దతు చేస్తోంది. ఈ చొరవ ప్రభుత్వం మద్దతు చేస్తున్న కాంపైన్ న్యూట్రిషన్ మంథ్(పోషణ మాసం)తో కలిసి వచ్చింది. ఇది పోషకాహారంలో జింక్ యొక్క కీలకమైన బాధ్యతను తెలియచేస్తుంది. గ్రామీణ పోషకాహార లోపాన్ని నిర్మూలించడే మిషన్‌ను సూచిస్తుంది, ఒక్క చిన్నారి కూడా ఆకలితో నిద్రించకూడదని నిర్థారిస్తుంది. పాల్గొనడం ద్వారా, రన్నర్స్ ఉదయ్ పూర్ చరిత్రలో భాగంగా ఉండటమే కాకుండా పేద వారికి జింక్ సమృద్ధిగా గల పోషకాహార భోజనాలను కూడా నేరుగా అందచేయడంలో తోడ్పడతారు.
 
ఈ రేస్‌కు మించి, వేదాంత జింక్ సిటీ హాఫ్ మారథాన్ ఆరోగ్యకరమైన జీవనాన్ని ప్రేరేపించడానికి, శారీరక, మానసిక సంక్షేమం రెండిటికీ ప్రాధాన్యత ఇస్తుంది. ఈ కార్యక్రమం సామాజిక, కమ్యూనిటీ నెట్ వర్కింగ్ కోసం మార్పును కలిగించడానికి రూపొందించబడింది, సంక్షేమానికి కట్టుబడిన వివిధ  భాగస్వామ్య నేపధ్యాల నుండి ప్రజలను ఐక్యం చేస్తుంది. నివారణా ఆరోగ్య సంరక్షణ యొక్క ప్రాధాన్యత గురించి చైతన్యం కలిగిన ప్రపంచంలో, ముఖ్యంగా మహమ్మారి తరువాత కాలంలో, ఈ మారథాన్ ఆరోగ్యవంతమైన, దృఢమైన- జింక్ సమృద్ధిగా గల జీవన శైలిని ప్రోత్సహించడానికి దారితీసే వేదికగా ఉంటుంది.
 
అరుణ్ మిశ్రా, హిందూస్థాన్ జింక్ లిమిటెడ్ సిఈఓ- మారథాన్ అభిమాని, ఎంతో ఉత్సాహంతో తన ఉద్వేగాన్ని వివరించారు. ”వేదాంత జింక్ సిటీ హాఫ్ మారథాన్‌ను ప్రారంభించడానికి మేము ఎంతో ఉత్సాహంగా ఉన్నాము. సమాజానికి, మా ప్రజల సంక్షేమానికి మా అచంచలమైన నిబద్ధతకు ఇది నిజమైన నిరూపణ. మారథాన్స్ కేవలం రేస్ లక్ష్యం కంటే ఎక్కువగా ఉంటాయి. మనల్ని కలపడానికి ఇవి దృఢమైన శక్తి, పరిగెత్తే చర్య కంటే అధిగమించాయి. ఇది ఆరోగ్యకరమైన భారతదేశానికి ప్రేరణ గురించి, ఒక సమయంలో ఒక చర్యగా, ఆకలితో చేసే మహోన్నతమైన పోరాటానికి తోడ్పడుతుంది. అంతర్జాతీయంగా మారథాన్స్‌లో పాల్గొన్న వ్యక్తిగా, ఈ కార్యక్రమం నా హృదయంలో ప్రత్యేకమైన స్థానాన్ని ఆక్రమించింది. దీని ఉత్తేజకరమైన దృశ్యం, ప్రతి అడుగు రాజస్థాన్ పట్టణం యొక్క సుసంపన్నమైన చరిత్ర నుండి వైభవోపేతమైన కథను చెబుతుంది, ఈ మారథాన్‌ను తక్కిన వాటి కంటే ప్రత్యేకంగా నిలుపుతుంది.”