30వేల మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించిన వోక్స్‌వ్యాగన్
కరోనా ప్యాండమిక్ కారణంగా ఇప్పటికే వేలాది మంది ఉద్యోగాలను కోల్పోయారు. తాజాగా గ్లోబల్ ఆటోమొబైల్ దిగ్గజం వోక్స్‌వ్యాగన్ 30,000 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించనుంది.
వ్యయాలను తగ్గించడం, టెస్లా వంటి ప్రత్యర్ధులకు ధీటైన పోటీ ఇచ్చే క్రమంలో కొలువుల కోత చేపడుతోందని ఓ జర్మన్ పత్రిక పేర్కొంది. పర్యవేక్షక బోర్డుకు వోక్స్‌వ్యాగన్ సీఈఓ ఈ మేరకు ప్రెజెంటేషన్ ఇచ్చారని తెలిపింది.
ఉద్యోగుల తొలగింపు ప్రతిపాదనపై చర్చ సాగుతున్నా ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వోక్స్‌వ్యాగన్ ప్రతినిధి మైఖేల్ మకే పేర్కొన్నారు. మరోవైపు ఉద్యోగుల తొలగింపు వార్తలు నిరాధారమని ఊహాగానాలపై తాము వ్యాఖ్యలు చేయబోమని వోక్స్‌వ్యాగన్ వర్కర్స్ కౌన్సిల్ ప్రతినిధి చెప్పుకొచ్చారు.