సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 5 జూన్ 2017 (12:04 IST)

బ్యాంకులకు ఎగనామం.. దర్జాగా భారత్-పాక్ మ్యాచ్ చూసిన విజయ్ మాల్యా

బ్యాంకుల నుంచి వేలకోట్ల రూపాయల రుణాలు తీసుకుని.. వాటికి ఎగనామం పెట్టిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా ప్రస్తుతం విదేశాల్లో బాగానే జల్సా చేస్తున్నాడు. భారత్ నుంచి బ్రిటన్‌కు పారిపోయిన వివాదాస్పద వ్యాపారవేత

బ్యాంకుల నుంచి వేలకోట్ల రూపాయల రుణాలు తీసుకుని.. వాటికి ఎగనామం పెట్టిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా ప్రస్తుతం విదేశాల్లో బాగానే జల్సా చేస్తున్నాడు. భారత్ నుంచి బ్రిటన్‌కు పారిపోయిన వివాదాస్పద వ్యాపారవేత్త విజయ్‌ మాల్యా అనూహ్యంగా ఆదివారం ఎడ్జ్‌బాస్టన్‌ మైదానంలో దర్శనమిచ్చాడు. చాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా ఈ మైదానంలో జరిగిన భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌ను అతను వీక్షించాడు.
 
ఇప్పటికే ఆర్థిక అక్రమాస్తుల కేసులలో విచారణ, అరెస్టు తప్పించుకోవడానికి మాల్యా దేశం వదలి బ్రిటన్‌ పారిపోయాడు. పలు కేసులు ఎదుర్కొంటున్న అతన్ని భారత్‌కు రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం నానా తంటాలు పడుతోంది. 
 
ఇటీవల అతన్ని లండన్‌ స్కాట్‌లాండ్ యార్డ్‌ పోలీసులు అరెస్టు చేసినా, వెంటనే బెయిల్‌పై విడుదలయ్యాడు. ఈ నేపథ్యంలో భారత్-పాక్ మ్యాచ్‌ను వీఐపీ స్టాండ్‌లో కూర్చుని వీక్షించిన ఫోటోలు ప్రస్తుతం నెట్లో వైరల్ అవుతున్నాయి. పరారీలో ఉన్నా కూడా దర్జాగా నిర్భయంగా మాల్యా మ్యాచ్‌ చూడటంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.