బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 1 మార్చి 2021 (12:02 IST)

జియో ట్యాగింగ్‌.. 18 నెలల పీజీడీజీఏఆర్డీ కోర్సు

దేశ వ్యాప్తంగా ఉపాధిహామీ సహా గ్రామీణాభివృద్ధిశాఖలో జరుగుతున్న పనులన్నింటినీ జియోట్యాగింగ్‌ చేస్తున్నారు. జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ (ఎన్‌ఐఆర్డీ) లోని సెంటర్‌ ఫర్‌ జియో ఇన్ఫర్మాటిక్‌ అప్లికేషన్‌ ఇన్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ (సీజీఏఆర్డీ) ద్వారా దీనిని అమలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఉపాధి హామీ ద్వారా చేసిన పనుల్లో 4,29,87,030 జియోట్యాగింగ్‌ పూర్తిచేశారు. దేశవ్యాప్తంగా 2.75లక్షల మందికి దీనిపై శిక్షణ ఇచ్చారు.
 
జియోట్యాగింగ్‌కు ఉన్న ప్రత్యేకత, ప్రాధాన్యం దృష్ట్యా దూరవిద్య కోర్సులను కూడా జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ నిర్వహిస్తుంది. దూరవిద్య ద్వారా 18 నెలల జియోస్పేషియల్‌ టెక్నాలజీస్‌ ఇన్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ (పీజీడీజీఏఆర్డీ) కోర్సు ఎన్‌ఐఆర్డీ, సీనియర్‌ అధికారులకు ఒక నెల అంతర్జాతీయ శిక్షణ కోర్సును సీజీఏఆర్డీ అందిస్తున్నది. వీటితోపాటు సీఐఆర్‌ఏపీ, ఏఏఆర్డీవో సభ్య దేశాల ప్రతినిధులకు 10 రోజుల శిక్షణ కోర్సును అందిస్తున్నారు.