గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 15 జూన్ 2022 (19:14 IST)

యూజీసీ కీలక నిర్ణయం: పీజీ లేకుండానే పిహెచ్‌డి

students
యూజీసీ కీలక నిర్ణయం తీసుకుంది. పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ (పిజి) లేకుండానే పిహెచ్‌డి చేసే అవకాశం విద్యార్థులకు దక్కనుంది. ఈ మేరకు యుజిసి నిబంధనలు రూపొందించింది. 
 
పిహెచ్‌డి ప్రవేశాలకు సంబంధించి 'యుజిసి నిబంధనలు - 2022'ను జూన్‌ నెలాఖరున ప్రకటించనున్నారు. ఈ విధానం 2022-23 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి రానుంది. 
 
నాలుగేళ్ల అండర్‌ గ్రాడ్యుయేషన్‌ కోర్సులో 7.5/10 సిజిపిఎతో ఉత్తీర్ణులైనవారు పిహెచ్‌డికి అర్హులని పేర్కొంది. ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసి, విభిన్న ప్రతిభావంతులకు 0.5 మేర సిజిపిఎ తక్కువగా ఉన్నా అనుమతిస్తారు.