శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. చెన్నై వార్తలు
Written By జె
Last Modified: మంగళవారం, 28 జనవరి 2020 (14:51 IST)

భార్య పుట్టింటికి వెళ్ళిపోయిందని... బాధతో అది కోసుకున్న భర్త

తన భార్య పుట్టింటికి వెళ్లిపోయిందన్న బాధ, తనకు పిల్లలు పుట్టడం లేదన్న కోపంతో ఓ వ్యక్తి తన మర్మాంగాన్ని కోసుకున్నాడు. తమిళనాడులో ఈ ఘటన జరిగింది. తమిళనాడు రాజధాని చెన్నైలో వాషర్‌మేన్ పేటలో బాబు, దేవి అనే దంపతులు నివసిస్తున్నారు. 
 
బాబు వయసు 40 సంవత్సరాలు. దేవి వయసు 35 ఏళ్లు. వారికి పెళ్లి జరిగి పదేళ్ళు అయినా ఇంకా పిల్లలు కలగలేదు. దీంతో బార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. బాబుకు మద్యం తాగే అలవాటు ఉంది. దీనిపై కూడా గొడవలు తరచూ జరుగుతూ ఉండేది. ఈ గొడవ కాస్త చాలా పెద్దదైంది. దీంతో గత శుక్రవారం మరోసారి గొడవ జరిగింది. భర్తతో విసిగిపోయిన దేవి అతడిని వదిలిపెట్టి తన పుట్టింటికి వెళ్లిపోయింది. 
 
తన భార్య తనను వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయిందన్న బాధ, మరోవైపు తనకు పిల్లలు పుట్టడం లేదన్న ఆవేదనతో రెండు రోజుల పాటు పూటుగా మద్యం సేవించాడు. ఆ మత్తులో ఉన్న బాబు ఆదివారం కిచెన్ లోకి వెళ్లి కత్తి తెచ్చుకుని తన మర్మాంగాన్ని కోసేసుకున్నాడు. అయితే, ఆ నొప్పికి తట్టుకోలేక పెద్దగా కేకలు వేస్తుండగా, ఇరుగుపొరుగు వారు వచ్చి అతడిని పరిశీలించి అసలు విషయం తెలుసుకుని నిర్ఘాంతపోయారు. వెంటనే బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాబు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.