మంగళవారం, 17 ఫిబ్రవరి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. చెన్నై వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 25 ఏప్రియల్ 2016 (15:41 IST)

ఎన్నికల ప్రచారానికి కెప్టెన్ వద్దు.. ప్రేమలతే ముద్దు: కోపం వస్తే కెప్టెన్ ఏం చేస్తారంటే?

ఎన్నికలు ప్రచారంలో పార్టీ అధినేత స్పీచ్ తప్పకుండా క్రేజ్ వుంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే తమిళనాడు రాజకీయాల్లో మాత్రం ఒక పార్టీ అధినేత పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. తమిళనాడు సీఎం ప్రచారం చేసుకుంటున్న డీఎండీకే అధినేత, కెప్టెన్ విజయ్‌కాంత్ ఎన్నికల ప్రచారానికి వస్తానంటే పార్టీ అభ్యర్థులు వణికిపోతున్నారు. 
 
విగ్రహం భారీగా ఉన్న నిగ్రహం ఏమాత్రం లేని విజయ్‌కాంత్ కారణంగా లేనిపోని సమస్యలు కొనితెచ్చుకునే కంటే.. ఆయన్ను ప్రచారానికి రావాల్సిన అవసరం లేదంటున్నారు. ఇటీవల కాలంలో ఆయన తీరు.. మాటలు హాట్ టాపిక్‌గా మారాయి. కోపం వస్తే వెనుకా ముందు చూసుకోకుండా జర్నలిస్టులు.. పార్టీ నేతల్ని కొట్టేస్తున్న కెప్టెన్ తీరుపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఎన్నికల వేళ ఇలాంటి వివాదాస్పద అంశాలు తమ విజయవకాశాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయోనన్న ఆందోళనకు గురవుతున్నారు.
 
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఎన్నికల ప్రచారానికి కెప్టెన్ వస్తున్నారంటే వణికిపోతున్న డీఎండీకే అభ్యర్థులు.. ఆయన స్థానే కెప్టెన్ సతీమణి ప్రేమలత రావాలని కోరుకుంటున్నారు. కెప్టెన్ వస్తానని చెప్పినా.. రావొద్దని ఆయన ముఖానే చెప్పిసి షాక్ ఇస్తున్నారు. ఎన్నికల ప్రచారానికి మీరొద్దయ్యా అంటూనే.. అమ్మగారిని పంపిస్తే చాలనటం డీఎండీకేలో ఇప్పుడో అలవాటుగా మారిపోయింది.