సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. చెన్నై వార్తలు
Written By chitra
Last Updated : బుధవారం, 26 అక్టోబరు 2016 (13:43 IST)

లైంగిక సామర్థ్యం పెరుగుతుందని దాని రక్తాన్ని తాగేస్తున్నారు(వీడియో)

కొందరు వ్యక్తులు ఉడుము రక్తాన్ని గటగటా తాగేస్తున్నారు. ఉడుము రక్తం తాగితే లైంగిక సామర్థ్యం, కండరాలు పటిష్టంగా తయారవుతాయన్నది వారి భావన. అందుకే ఉడుముని పట్టుకొని ముక్కలుగా కోసి ఆ రక్తాన్ని గాజుగ్లాసుల్లో పిండుతున్న వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్

కొందరు వ్యక్తులు ఉడుము రక్తాన్ని గటగటా తాగేస్తున్నారు. ఉడుము రక్తం తాగితే లైంగిక సామర్థ్యం, కండరాలు పటిష్టంగా తయారవుతాయన్నది వారి భావన. అందుకే ఉడుముని పట్టుకొని ముక్కలుగా కోసి ఆ రక్తాన్ని గాజుగ్లాసుల్లో పిండుతున్న వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో వెలుగు చూడటంతో దీనిపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని చెన్నైలోని రాష్ట్ర వన్యప్రాణి ప్రధాన కార్యాలయం అధికారులు అటవీ శాఖ రేంజర్లను ఆదేశించారు. 
 
ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయమేంటంటే.. ఒక్క గ్లాసు ఉడుము రక్తానికి గాను దాదాపు రూ.5వేలు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఉడుమును రక్తం కోసం చంపడం వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద తీవ్రమైన నేరమని, ఉడుము సరీసృపాల రక్షిత జంతువు అని చెన్నై వన్యప్రాణి వార్డెన్ కె గీతాంజలి వెల్లడించారు. 
 
ఈ వీడియో పాళవన్‌తాంగల్ ఏరియాలో అప్‌లోడ్ చేసివుంటారని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాంచీపురంలోని అటవీ ప్రాంతంలో నివశించే గిరిజనులు కొందరు చెన్నైలో స్థిరపడ్డారని వారే ఇలా ఉడుముని చంపి రక్తాన్ని తీశారని అటవీ శాఖాధికారులు అంటున్నారు. రక్తం కోసం ఉడుములను చంపిన వీడియో సోషల్ మీడియాలో సంచలనం రేపడంతో అటవీశాఖ వన్యప్రాణివిభాగం అధికారులు దీనిపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు.