ఆహారం ముట్టని శశికళ : తొలిరోజు జైలు జీవితం ఇలా ముగిసింది
బుధవారం ఉదయంనుంచి పచ్చి మంచినీళ్లయినా ముట్టకుండా చెన్నై మెరీనా తీరంలోని జయలలిత సమాధి వద్దకు వచ్చి మంగమ్మ శపథం లాంటి భీషణ ప్రతిజ్ఞలు చేసి అక్కడినుంచి నేరుగా బెంగళూరు జిైలుకు బయలుదేరిన అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ ఆ రోజంతా ఏమీ తినలేదని సమాచారం
బుధవారం ఉదయంనుంచి పచ్చి మంచినీళ్లయినా ముట్టకుండా చెన్నై మెరీనా తీరంలోని జయలలిత సమాధి వద్దకు వచ్చి మంగమ్మ శపథం లాంటి భీషణ ప్రతిజ్ఞలు చేసి అక్కడినుంచి నేరుగా బెంగళూరు జిైలుకు బయలుదేరిన అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ ఆ రోజంతా ఏమీ తినలేదని సమాచారం.
.
అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ జైలులో తొలిరోజు రాత్రి ఏమీ తినకుండా గడిపారు. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో ఆమె బుధవారం బెంగళూరు పరప్పన అగ్రహార జైలుకు చేరిన విషయం తెలిసిందే. మొదటిరోజు రాత్రి ఏమీ తినకుండానే ఉన్నారు. నిబంధనల ప్రకారం నేలపై చాప, దిండు వేసుకుని రగ్గు కప్పుకుని పడుకున్నారు. గురువారం తెల్లవారుజామున 530 గంటలకే మేలుకుని కాలకృత్యాలు ముగించి ఇళవరసితో కలిసి కొద్దిసేపు జైలులోనే పచార్లు చేశారు. ఉదయం 6.30 గంటలకు వెజిటబుల్ పలావ్ తిన్నాక, జైలు గ్రంథాలయంలో ఇంగ్లీషు, తమిళ దినపత్రికలు చదివారు. కొద్దిసేపు బ్యారెక్‌లో విశ్రాంతి తీసుకున్నారు.
సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో టీ తాగారు. అటుపై ఇళవరసితో పాటు సహఖైదీలతో మాట్లాడారు. ఆమెను కలిసేందుకు తమిళనాడులోని పలు జిల్లాల నుంచి వచ్చిన ద్వితీయశ్రేణి నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, అభిమానులను పోలీసులు అనుమతించలేదు. శశికళను కలవడానికి తమిళనాడు నూతన ముఖ్యమంత్రి ఎడపాడి కే.పళనిస్వామి శుక్రవారం ఉదయం ఇక్కడకు వస్తున్నారు.