శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. చెన్నై వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శుక్రవారం, 9 జూన్ 2017 (01:50 IST)

తమిళ రాజకీయాల్లో విజయశాంతి ఎంట్రీ.. శశికళతో భేటీతో మళ్లీ మొదలైన కెరీర్‌

అందరికీ అర్థమయ్యాయి. ఒకప్పటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఇప్పుడు శశికళ వర్గం అన్నాడీఎంకేకి పొలిటికల్ స్టార్ కాబోతోందని దినకరన్ ఆమెకు ప్రాధాన్యం ఇచ్చినప్పడే బోధపడింది. ఒకవైపు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఈసారి రాజకీయాల్లోకి రావడం ఖాయమని, ఆగస్టులోగా పొల

తనకు మద్దతిస్తున్న ఎమ్మెల్ల్యేలతో భేటీని కూడా పక్కనపెట్టి దినకరన్ ఆమెకు సాదరస్వాగతం ఇచ్చినప్పుడే సంకేతాలు అందరికీ అర్థమయ్యాయి. ఒకప్పటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఇప్పుడు శశికళ వర్గం అన్నాడీఎంకేకి పొలిటికల్ స్టార్ కాబోతోందని దినకరన్ ఆమెకు ప్రాధాన్యం ఇచ్చినప్పడే బోధపడింది. ఒకవైపు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఈసారి రాజకీయాల్లోకి రావడం ఖాయమని, ఆగస్టులోగా పొలిటికల్ ఎరీనాలోకి రజనీ రాబోతున్నాడని స్పష్టమయిందే తడవుగా దినకరన్ శరవేగంగా పావులు కదిపారు.

ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో టీటీవీ దినకరన్ తరపున విజయశాంతి ప్రచారం చేసినప్పుడే ఆమెకున్న ఫాలోయింగ్‌తో పాటు రాజకీయ అనుభవం కూడా అన్నాడీఎంకేకు కలిసి వస్తాయని దినకరన్ అంచనా వేశాడు. రజనీ పొలిటకల్  ఎంట్రీ కంటే ముందే విజయశాంతిని అన్నాడీఎంకేలోకి చేర్చుకోవడం ద్వారా లబ్దిపొందొచ్చని గ్రహించిన వెంటనే దినకరన్ పావులు కదిపారు. ముందుగా విజయశాంతిని శశికల వద్దకు తీసుకెళ్లారు. 
 
ఈనెల 5న దినకరన్‌ బెంగళూరుకు వెళ్లి శశికళను కలుసుకున్నారు. ఆయన వెళ్లిన కొద్దిసేపట్లోనే విజయశాంతి సైతం చిన్నమ్మతో ములాఖత్‌ అయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు ఇద్దరూ పలు విషయాలపై మాట్లాడుకున్నట్లు సమాచారం. దినకరన్‌ సూచన మేరకు శశికళ.. విజయశాంతిని పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలిసింది. నటిగా జనాకర్షణ, మహిళా నేత ఉంటే పార్టీని కట్టడి చేయడం సులభం అవుతుందని చిన్నమ్మ, దినకరన్‌ అంచనా వేసినట్లు పార్టీ వర్గాల కథనం.
 
ప్రతిఘటన, కర్తవ్యం, ఒసేయ్ రాములమ్మ, వందేమాతరం వంటి పవర్‌పుల్ సినిమాల ద్వారా నటిగా అత్యున్నత శిఖరాలు అధిరోహించి ‘లేడీ అమితాబ్‌ బచ్చన్‌’ అనే బిరుదును పొందిన విజయశాంతి.. 1998లో బీజేపీలో చేరడం ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు. ఆ తరువాత ‘తల్లి తెలంగాణ’ పార్టీని స్థాపించారు. అటుపై ఆ పార్టీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేశారు.

నేటి సీఎం కేసీఆర్‌ అప్పట్లో విజయశాంతికి టీఆర్‌ఎస్‌ జనరల్‌ సెక్రటరీ పోస్టు ఇచ్చి గౌరవించారు. అయితే తెలంగాణ ఏర్పాటు అనంతరం (2014 ఎన్నికల సమయంలో) విజయశాంతి అనూహ్యంగా టీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌ పార్టీలో చేరి ఓటమిపాలై రాజకీయాలకు దూరంగా ఉన్నారు. మళ్లీ జయలలిత మరణానంతరం చెన్నైలో సందడిచేశారు.