ఉక్కు మనిషిని పిండి చేసేసిన కరోనా, బాడీ బిల్డర్ జగదీష్‌ కరోనా కాటుతో మృతి

Jagadeesh Lad
ఐవీఆర్| Last Modified శుక్రవారం, 30 ఏప్రియల్ 2021 (16:10 IST)
ఫోటో కర్టెసీ- ఫేస్ బుక్
భారతదేశం బాడీ బిల్డర్లు గురించి మాట్లాడితే 34 ఏళ్ల జగదీష్ టక్కున గుర్తుకు వస్తారు. బాడీబిల్డింగ్‌లో అన్ని అగ్రశ్రేణి టైటిళ్లు గెలుచుకున్న బాడీబిల్డర్ జగదీష్ లాడ్ కరోనాతో కన్నుమూశారు. జగదీష్ వయసు కేవలం 34 సంవత్సరాలు. అతను బరోడాలో తుది శ్వాస విడిచాడు. జగదీష్ మరణం బాడీబిల్డింగ్ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టింస్తోంది.

బరోడాలోని నవీ ముంబైలో నివసిస్తున్న జగదీష్ గతేడాది జిమ్ ప్రారంభించాడు. ఆ కారణం చేత అతను బరోడాలో ఉంటూ వచ్చాడు. జగదీష్ కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడ్డాడు. చివరకు ఆయన శుక్రవారం కన్నుమూశారు.
Jagadeesh Lad

జగదీష్ పోటీకి నిలబడితే, పతకం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే అతడి వంపులు తిరిగిన కండలు, బాడీ ఆకృతి ముందు మిగిలినవారు తేలిపోతారు. జగదీష్ ఆ ఆకృతి కోసం చాలా కష్టపడ్డాడు. అతను ప్రతి ఉదయం లేచి రెండు గంటలు వ్యాయామం చేసేవాడు. ప్రోటీన్, చికెన్, గుడ్లు మరియు మాంసంతో పాటుగా మంచి ఆహారం రోజువారీ తీసుకునేవాడు.

జగదీష్ లాడ్ చిన్న వయస్సులోనే బాడీబిల్డింగ్ ప్రారంభించాడు. మహారాష్ట్రలో దాదాపు నాలుగు సార్లు బంగారు పతకం సాధించాడు. మిస్టర్ ఇండియా పోటీలో రెండు బంగారు పతకాలు కూడా గెలుచుకున్నాడు. ముంబైలో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాన్ని కూడా గెలుచుకున్నాడు.

ఆయన మరణానికి మహారాష్ట్ర బాడీబిల్డింగ్ అసోసియేషన్, ముంబై అసోసియేషన్ విచారం వ్యక్తం చేశాయి. బాడీబిల్డింగ్ ప్రపంచంలో సుపరిచితమైన వ్యక్తిని కోల్పోవడంపై ఆవేదన వ్యక్తం చేసాయి.దీనిపై మరింత చదవండి :