శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 30 ఏప్రియల్ 2021 (14:47 IST)

ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో కోవిడ్ కేసులు.. 64మంది మృతి

ఆంధ్రప్రదేశ్‌లో రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 74,435 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, అందులో కొత్తగా 14,669 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. అలాగే తాజాగా 64 మంది మృతి చెందినట్లు తెలిపారు.
 
ఇప్పటి వరకు రాష్ట్రంలో 10,54,875 మంది కరోనా బారిన పడగా, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 7,800 మంది మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో విజయనగరంలో 8 మంది మృతి చెందగా, అనంతపురం, తూర్పుగోదావరి, గుంటూరు, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లా ఆరుగురు చొప్పున, చిత్తూరులో ఐదుగురు, కర్నూలు, ప్రకాశం, విశాఖ, పశ్చిమగోదావరి జిల్లాల్లో నలుగురు చొప్పున, కృష్ణాలో ముగ్గురు, వైఎస్సార్‌ కడప జిల్లాలో ఇద్దరు చొప్పున మృతి చెందినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. 
 
ఇక గడిచిన 24 గంటల్లో 7,055 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 9,47,629 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో 99,446 యాక్టివ్‌ కేసులున్నాయి.