సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 4 ఏప్రియల్ 2020 (08:54 IST)

మనుషులా.. తీవ్రవాదులా : వైద్య సిబ్బందిపై ఉమ్మేస్తున్న కరోనా బాధితులు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మరణ మృదంగం కొనసాగుతోంది. అలాగే, మన దేశంలోనూ రోజురోజుకూ ఈ మరణాల సంఖ్య పెరుగుతోంది. అదేసమయంలో ఈ వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య కూడా ఎక్కువ అవుతూనే ఉంది. అయితే, కరోనా వైరస్ అనుమానిత లక్షణాలతో ఉన్న వారిని ముందుగా గుర్తించి క్వారంటైన్‌ వార్డుల్లో ఉంచుతున్నారు. ఇలాంటివారు చేస్తున్న చేష్టలు చూస్తుంటే.. ప్రతి ఒక్కరూ సహనం కోల్పోయేలా చేస్తోంది. 
 
తాజాగా కొందరు అనుమానితులను క్వారంటైన్ వార్డులో ఉంచగా, వారు మెడికల్‌ సిబ్బందిపై ఉమ్మి వేస్తున్నారు. ఈ ఘటన అసోంలోని గోలాఘాట్‌ జిల్లా ఆస్పత్రిలో చోటుచేసుకుంది. అసోం నుంచి తబ్లిగీ జమాత్‌ కార్యక్రమానికి హాజరై వచ్చిన వారిలో 8 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. వీరితో సన్నిహితంగా మెలిగిన 42 మందిని గోలాఘాట్‌ ఆస్పత్రిలోని క్వారంటైన్‌ వార్డుకు తరలించారు. ఈ 42 మంది ఆస్పత్రి సిబ్బందితో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. వార్డు మొత్తం ఉమ్మివేశారు. 
 
అంతేకాకుండా వార్డు కిటికీల్లోంచి కూడా బయటకు ఉమ్మేశారు. దీంతో క్వారంటైన్‌ వార్డుల్లోకి వెళ్లేందుకు మెడికల్‌ సిబ్బంది భయపడుతున్నారు. ఈ ఘటనపై అసోం ఆరోగ్య శాఖ మంత్రి హిమాంత బిశ్వా శర్మ మండిపడ్డారు. ఆయన ఆస్పత్రిని సందర్శించే కంటే ముందు క్వారంటైన్‌ వార్డులో ఉమ్మేశారు. క్వారంటైన్‌లో ఉన్న వారందరూ మెడికల్‌ సిబ్బందికి సహకరించాలని ఆరోగ్య శాఖ మంత్రి కోరారు. వారంతా తమకు కరోనా సోకలేదనే భ్రమలో ఉన్నారు అని మంత్రి తెలిపారు. అసోంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 20కి చేరింది.