మా ఆస్పత్రి ఫుల్.. పడకల్లేవ్.. ఇక్కడకు రావొద్దు
దేశంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. దీంతో అనేక ఆస్పత్రుల్లో పడకలన్నీ ఫుల్ అయ్యాయి. ఆక్సిజన్ నిల్వలు నిండుకున్నాయి. ఫలితంగా రెండో దశ కరోనా వైరస్ దెబ్బకు దేశంలో అల్లకల్లోల పరిస్థితులు నెలకొనివున్నాయి.
మరోవైపు, కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతుండటంతో ఆసుపత్రులన్నీ రోగులతో నిండిపోతున్నాయి. ఒకవైపు బెడ్స్ లేక, మరోవైపు ఆక్సిజన్ కొరత నేపథ్యంలో కొత్త రోగులను చేర్చుకునేందుకు ఆసుపత్రులు చేతులెస్తున్నాయి.
మధ్యప్రదేశ్ సెహోర్ జిల్లా ఆసుపత్రిలో పడకలు రోగులతో నిండి పోయాయి. దీంతో ఇక ఎవర్నీ అడ్మిట్ చేసుకోలేమంటూ ఆసుపత్రి గేట్‌కు నోటీసులు అంటించారు.
జిల్లా ఆసుపత్రిలోని అన్ని పడకలు బుధవారం రాత్రితో నిండిపోయాయని సివిల్ సర్జన్ తెలిపారు. దీంతో రోగులను అడ్మిట్ చేసుకోలేమని చెప్పారు. దీనికి తోటు ఆక్సిజన్ సిలెండర్ల సరఫరా గతం కన్నాతక్కువగా ఉన్నదని అన్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో జిల్లా ప్రజలు ఆసుపత్రికి రావద్దని, ఇంటి వద్దనే ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దేశంలోని చాలా ఆసుపత్రుల్లో ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి.