చైనాలో విజృంభిస్తోన్న కరోనా.. ఒకే నెలలో 60వేల మంది మృతి
చైనాలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో సడలింపులు ప్రకటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం చైనాలో పరీక్షించిన వారిలో 95 శాతం మందికి పరివర్తన చెందిన బీఎఫ్-7 వైరస్ సోకింది.
చైనాలో ఒమిక్రాన్ వైరస్ కొత్త వేరియంట్లో 95 శాతం మాత్రమే వ్యాపించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రపంచ దేశాలను హెచ్చరించింది.
ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. చైనాలో కరోనా ఆంక్షల సడలింపు కారణంగా 2,40,000 మంది వేర్వేరు ప్రాంతాలకు వెళ్లిపోయారని సమాచారం. అయితే ఒక నెలలో 60వేల మంది ప్రాణాలు కోల్పోయారు.