సోమవారం, 2 అక్టోబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : గురువారం, 28 జులై 2022 (23:18 IST)

చైనాలో మళ్లీ కరోనా.. లాక్‌డౌన్‌లో పది లక్షల మంది

corona
చైనాలో మరోసారి కరోనా వైరస్ విజృంభించింది. వుహాన్‌లో నాలుగు కొత్త కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. జీరో కొవిడ్ నిబంధనలు అమలు చేసింది. దాదాపు 10 లక్షల మందిని లాక్‌డౌన్‌లో ఉంచారు.
 
జియాంగ్జియా జిల్లాలో ఉన్న ప్రజలను ఇళ్లలోనే ఉండాలని అధికారులు కోరారు. చైనా అమలు చేస్తున్న కొవిడ్ ఆంక్షల విధానాలతో ప్రజల్లో తీవ్ర అసహనం పెరుగుతోంది. వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.